Monday, 14 September 2026 01:45:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి...

Date : 05 January 2023 10:25 PM Views : 946

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం అర్బన్, కొండపల్లి (విజయవాడ) నుండి కాజీపేట సెక్షన్ వరకు 3వ రైల్వే లైన్ విద్యుద్దీకరణతో పాటు ఏర్పాటుకు గాను ఖమ్మం జిల్లాలో అవసరమగు భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం అర్బన్ మండలంలో 3వ రైల్వే లైన్ భూ సేకరణ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి గురువారం కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. స్థానిక నర్తకి థియేటర్ వద్ద, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ క్రింద ప్రాంతాన్ని కాలినడకన ట్రాక్ వెంబడి సారధి నగర్, బురహాన్ పూరం తదితర ప్రాంతాలు, కోల్పోతున్న ఇండ్లు, కట్టడాలను కలెక్టర్ పరిశీలించారు. రైల్వే లైన్ ఎక్కడి వరకు వస్తుంది, ఎంత మేర భూ సేకరణ అవసరం ఉంటుంది అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారి ఎంత మేర సేకరణలో వెళ్తుంది, తిరిగి రహదారికి భూసేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పబ్లిక్ టాయిలెట్స్, ఇతర కట్టడాలు ఎంత మేర ప్రభావితం అవుతాయి అడిగి తెలుసుకున్నారు. రైల్వే గేటు వద్ద నుండి ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్లి ట్రాక్ ప్రక్కనున్న నీటి నిల్వలు ఎలా తొలగించాలి, డ్రయినేజికి సమస్యలు తలెత్తకుండా ఏ ఏ చర్యలు చేపట్టాలి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ శిబిర కార్యాలయం భూ సేకరణలో ఎంత మేర నష్టం వాటిల్లుతుందో అడిగి తెలుసుకున్నారు. ఏ ఏ కట్టడాలు, ఇతరాలు ప్రభావితం అయ్యేది సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. కొండపల్లి (విజయవాడ) నుండి కాజీపేట సెక్షన్ వరకు 3వ రైల్వే లైన్ విద్యుద్దీకరణతో పాటు ఏర్పాటుకుగాను జిల్లాలో భూసేకరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కామేపల్లి మండలాలకు చెందిన 30 గ్రామాల నుండి 117. 19 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. భూసేకరణలో భాగంగా ఖమ్మం అర్బన్ మండలంలోని ఖమ్మం రెవిన్యూ గ్రామంలో సుమారు 1. 10 ఎకరాలు, బురహాన్ పురం రెవిన్యూ గ్రామం 1. 16 ఎకరాల సేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, మునిసిపల్ ఇఇ కృష్ణ లాల్, రైల్వే డివిజనల్ ఇంజనీర్ టి. సూర్యనారాయణ, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, ఆర్ అండ్ బి ఏఇఇ విశ్వనాథ్, టౌన్ ప్లానింగ్ అధికారులు వసుంధర, వికాస్, సంతోష్, రెవిన్యూ అధికారి జి. శ్రీనివాసరావు అధికారులు తదితరులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: