Thursday, 30 July 2026 05:48:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ రాష్ట్ర అవతరణ ధశాబ్ది వేడుకల ఉత్సవాలలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ.

Date : 16 June 2023 02:17 AM Views : 429

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని వివిధ గ్రామ పంచాయితీలలో సర్పంచులు ఘనంగా జాతీయ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్ని గ్రామ సర్పంచ్ అక్రమ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మన గ్రామ రూపురేఖలు మారిపోయావన్నారు. గ్రామీణ నేడు తెలంగాణ పల్లెలు మౌలిక వసతులతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి అని ఆయన అన్నారు. అనంతరం గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలతోపాటు పంచుకున్నారు. ప్రజల ప్రజాభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి శాలువా కప్పి సన్మానించారు. మొదటి బహుమతి ఊట్కూర్ చంద్రమ్మ 500/- రూపాయల నగదు అందుకోగా... రెండవ బహుమతి కుంటిమారి లలిత 300/- రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. బహుమతిలు సర్పంచ్ అక్రమ్, పంచాయతీ కార్యదర్శి రమేష్ చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాసం చిన్న రంగప్ప, ఉపసర్పంచ్ కృష్ణయ్య గౌడ్, ఎఈఓ మునిరాబేగం అంగన్వాడీ టీచర్లు, వివిధ మహిళా సంఘాల లీడర్లు విఆర్ఏ లు , పారిశుధ్య కార్మికులు , గ్రామ పెద్దలు , యువకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :