సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : హయతనగర్ ఎస్.వి.కన్వెన్షన్ లో మంగళవారం 3 పాలకవర్గ స్థానాలకు సంబంధించి ఉదయం 8 నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 282 మంది సొసైటీల ఛైర్మన్లకు ఓటు హక్కు ఉండగా... 275 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపట్టారు. మూడు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉండగా టీఆర్ఎస్ మద్దతుదారులు గొల్లెపల్లి రాంరెడ్డి-239, కసూర్తిపండు-241, మందాడి ప్రభాకర్ రెడ్డి - 204 ఓట్లు సాధించి గెలుపొందరు. బత్తుల నరేందర్ రెడ్డి-68, యస్. వెంకటనర్సింహారెడ్డి -63 ఓట్లు సాధించారు. ఎన్నిక ఏకగ్రీవం కాక పోవడంతో అధికార పార్టీ నాయకులు సొసైటీ ఛైర్మన్లతో క్యాంపు ఏర్పాటు చేసి తమ ప్యానెల్ అభ్యర్థులను గెలుపించుకున్నారు. అభ్యర్థులకు ఎన్నికల అధికారి హనుమంతరావు ధ్రువీకరణ పత్రాలను అందించారు. కాగా... 6 గంటలకు ఛైర్మన్ ను ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహించాల్సి ఉండగా... కోరం లేనందున బుధవారం ఉదయం 11 గంటలకు మదర్ డెయిరీ కార్యాలయంలో ఛైర్మన్ ఎన్నిక ఉంటుందని ఎన్నికల అధికారి తెలిపారు.
-----------------------
Admin