Wednesday, 29 July 2026 03:58:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖమ్మం జిల్లా చైతన్యవంతుల జిల్లా...

Date : 18 January 2023 12:16 AM Views : 851

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని, ఇక్కడ ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తానన్నాడట అలా ఉంది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిస్థితి అని అన్నారు. రాష్ట్రంలో పంచాయతీలకు నిధులు ఇవ్వలేని ప్రభుత్వం బీ ఆర్ ఎస్ తో దేశాన్ని బాగు చేస్తదా అని విమర్శించారు. 8 సంవత్సరాలలో ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. స్థానిక మంత్రి నాయ పైసా కూడా హైదరాబద్ నుండి తీసుకురాలేదని జిల్లా ప్రజల కట్టే పన్నులు, ఎల్ఆర్ఎస్, బీ ఆర్ ఎస్ లతో వచ్చే ఆదాయంతో తన ఆస్తులు ఉన్న ఏరియాలో నాలుగు డివైడర్లు కలర్ఫుల్ లైట్లు వేయించి అభివృద్ధి చేశామని చెప్తూ డప్పు కొట్టుకుంటున్నారని విమర్శించారు. అంత అభివృద్ధి చేసిన వాళ్లయితే బహిరంగ సభకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అవినీతిపరుల ఫోటోలకి బదులు అభివృద్ధి కార్యక్రమాలను పెట్టి ఉండాలని అన్నారు. మున్సిపాలిటీలను అభివృద్ధి చేశామని చెబుతున్న కేటీఆర్ ఏ ఒక్క మున్సిపాలిటీకి ప్రత్యేక నిధుల కేటాయించలేదని స్పష్టం చేశారు. వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల అభివృద్ధికి ఎంత మొత్తం నిధులు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ విధానాలు అరచేతుల్లో వైకుంఠపురం చూపించే విధంగా ఉంటాయని ఆచరణకు మాత్రం రావని ఎద్దేవా చేశారు. అభివృద్ధికి 100 కోట్లు నిధులు కేటాయించిన కెసీఆర్ ఇంతవరకు నిధులే విడుదల చేయాలేదని అన్నారు. కుర్చీ ఏసుకొని కూర్చొని పోడు రైతులకు పట్టాలిస్తానని చెప్పి ఇంతవరకు ఒక్క రైతుకు కూడా పట్ట పంపిణీ చేయలేదని అన్నారు. కలెక్టరేట్ నిర్మాణానికి 38 కోట్లకి అంచనా వేస్తే ఆరు నెలల కాలానికే 20 కోట్లు పెంచి దాదాపు 50 నుంచి 60 కోట్ల ఖర్చు అయిందని, ఎప్పుడో ఆరెండ్ల కింద డబుల్ బెడ్ రూం ఇండ్లకు 5 లక్షల రూపాయలు కే టాయించి ఇప్పుడు 3లక్షల రూపాయలు ఇస్తామనడం లోనే మోసం కనపడుతుందని అన్నారు.ఇంకా ఇంకా మోసపోడా నికి జిల్లా ప్రజలు సిద్ధంగా లేరని ఖమ్మం నుండే కేసీఆర్ కు రాజకీయ వీఆర్ఎస్ తప్పదని హెచ్చరించారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ..అధికారాలు ఎవరికి శాశ్వతం కాదని అన్నారు. హరీష్ రావు కాంగ్రెస్ గురించి మాట్లాడే ముందు గతంలో కాంగ్రెస్ ఏం చేసిందో గుర్తుచేసుకుని మాట్లాడాలని అన్నారు. సోనియమ్మ దయతో నేడు అధికారమెక్కి కాంగ్రెస్ పై అవాకులు చెవాకులు పెలోద్ధని హెచ్చరించారు. జిల్లాకు టీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. పార్టీ బహిరంగ కోసం కలెక్టర్ స్వయంగా డోజర్ దగ్గర నిలబడి సభా స్థలిని శుభ్రం చేయించడం ఎక్కడా చూడలేదని అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు కాలం చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ పి సి సి సభ్యులు రాయల నాగేశ్వరరావు,ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు పుచ్చకాయలవీరభద్రం,జిల్లా యవజన కాంగ్రెస్ అద్యక్షులు యడ్లపల్లి సంతోష్,ఖమ్మం నగర కాంగ్రెస్ కార్పోరేటర్లు మిక్కిలినేని మంజులానరేందర్,ముస్తఫారఫేదాభేగం,రాష్ట్ర మైనారిటి నాయకులు బి యచ్ రబ్బాని,నగర బి సి సెల్ అద్యక్షులు బాణాల లక్ష్మణ్,నగర మైనారిటి అద్యక్షులు అబ్బాస్,నగర ఐ యన్ టి యు సి అద్యక్షులు నరాల నరేష్ తదితర నాయకులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :