Wednesday, 29 July 2026 09:15:55 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఫైనాన్స్ పేరుతో తక్కువ రోజులలో ఎక్కువ డబ్బులు ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్న భార్య భర్తలను అరెస్టు...

Date : 16 January 2024 02:11 AM Views : 314

సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : ఎస్ఐ అరుణ్ కేసు వివరాలు తెలియపరుస్తూ కొల్తుర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు అయిన భాగవతం శివశంకర్, భాగవతం శశికళ, ఇద్దరు 2022 జనవరి సంవత్సరం లో SHAMIRPET NIDHI LTD ను ఎలాంటి ప్రభుత్వ అనుమతి, లైసెన్స్ లేని కంపెనీ నీ గజ్వేల్ , సిద్దిపేట, ముతంగి, కందుకూరు, దేవరకొండ మరియు నల్గొండ లో ఏర్పాటుచేసి దాని ద్వారా చిట్టీలు మరియు ఋణాలు ఇప్పిస్తామని చెపుతూ రెండు స్కీములను ప్రవేశపెట్టి అందులో భాగంగా వారి వద్ద ఎవరైనా కొంత అమౌంట్ కడితే 45 రోజుల తర్వాత అందుకు వాళ్ళు కట్టిన దానికి పది రేట్ల అమౌంట్ ఇస్తామని, డైరెక్ట్ గా వారి బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని చెక్ లు ఇస్తారు. మరియు ఎవరికైనా ఋణాలు కావాలంటే వారికి కావలసిన రుణాల డబ్బులకి 10% డబ్బులేని బాధితుల వద్ద తీసుకొని 6 నెలల తర్వాత వారికి రుణాల అమౌంట్ నీ ఇస్తామని చెప్పి మోసపూరితంగా బాధితుల చేత డబ్బులు ఇవ్వకుండానే మొత్తం డబ్బులు ఇచ్చినట్లుగా బాండ్ పేపర్ పైన రాసుకొని వారు తీసుకున్న డబ్బులు కట్టలేని పక్షంలో ఇళ్లు కానీ స్థలాలు కానీ ఆ కంపెనీ పేరు మీద ఉండేటట్లు రాయించుకుంటారు... బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఎల్కల్ గ్రామానికి చెందిన పిట్ల కృష్ణ, ఇంటేనుక నరసవ్వ, పిట్ల చిన్న వెంకటయ్య, మర్కంటి రాజు మరియు దొనేపల్లీ లింగం, తదితరుల దగ్గర మొత్తంగా 2,60,000 తీసుకుని అందుకు పది రెట్లు 45 రోజుల తర్వాత 10 రేట్ల డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వారిని మోసం చేశారు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుతో బేగంపేట ఎస్ఐ అరుణ్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. పై నిందితులిద్దరిని అరెస్టు చేసి వారిద్దరి దగ్గర SHAMIRPET NIDHI LTD కి సంబందించిన రికార్డ్స్ లను , బాండ్ లను, స్టాంప్ స్వాధీనం చేసుకొని పై ఇరువురిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం పంపించడం జరిగిందని ఎస్ఐ ఒక ప్రకటనలో తెలిపారు.. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాలలోకి వచ్చి ఫైనాన్స్ ఇస్తాము డబ్బులు రెట్టింపు చేస్తాము రకరకాల మోసాలతో గ్రామాలలో తిరిగే వ్యక్తులను నమ్మవద్దని వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. అరుణ్, బేగంపేట ఎస్ఐ

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :