Sunday, 13 September 2026 11:04:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రభుత్వ భూముల వేలాన్ని ఆపాలి ఎన్ హెచ్ ఆర్ సి. వరంగల్ జిల్లా అధ్యక్షులు మెరుగు రాంబాబు*

Date : 16 November 2025 03:36 PM Views : 368

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్: మహానగరం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేని దుస్థితిలో ఉండడం మూలాన అభివృద్ధి పనుల పేరుతో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) నగరంలో భూముల అమ్మకం కోసం ప్రకటన విడుదల చేసిందని నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని ప్రభుత్వ భూములను కాపాడల్సిన బాధ్యత అధికారులదేనని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) వరంగల్ జిల్లా అధ్యక్షులు మెరుగు రాంబాబు అన్నారు. ఈ మేరకు బాలసముద్రంలోని రెండెకరాల 34 గుంటల భూమిని వేలం వేసే ప్రకటన జారీ చేసింది. రూ. 85 కోట్ల ప్రాథమిక ధరతో వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నగరం నడిబొడ్డున విలువైన ప్రభుత్వ భూమిని వేలం వేసేందుకు సిద్ధం కావడం పట్ల రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే ఈ భూమిని తక్షణావసరం కోసం అమ్మకానికి సిద్ధంకావడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘కుడా’ తీరుపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆదాయం కావాలనుకుంటే ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి లీజుకు ఇవ్వడం ద్వారా, వ్యాపార సముదాయాలు, మల్టిప్లెక్స్ లను కట్టించి అద్దెకు ఇవ్వడం ద్వారా తన ఆదాయ మార్గాలను పెంచుకోవచ్చు. ఆదాయ మార్గాలు ఎన్నో ఉన్నప్పటికీ కానీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే నగర నడిబొడ్డున ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా నగరాన్ని అభివృద్ధి చేస్తామనడం ప్రస్తుతం ప్రజా సంపదగా ఉన్న ప్రధాన స్థలాలను విక్రయించి రానున్నకాలంలో ప్రజావసరాలు, ప్రభుత్వ అవసరాలకు స్థలం అవసరమైతే ఎక్కడి నుండి తెస్తారు. నగర అభివృద్ధికి నిధులు లేవని భూముల వేలానికి పూనుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే ఇలాంటి వైఖరి తీసుకోవడం సరైన నిర్ణయం కాదని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని, లేని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు సురేందర్, ఖిల్లా వరంగల్ మండల అధ్యక్షులు దిలీప్ కుమార్, దుగ్గొండి మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నల్లబెల్లి మండల అధ్యక్షులు మధుకర్, సోషల్ మీడియా కన్వీనర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: