సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వచ్ఛభారత్ మిషన్ ఆక్టివిటీస్, లేబర్ మొబలైజేషన్, క్రీడా ప్రాంగణాలు మొదలైన ఉపాధి హామీ పనులపై జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ ఆక్టివిటీస్, లేబర్ మొబలైజేషన్, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు మొదలైన ఉపాధి హామీ పనులు పెండింగ్ లేకుండా త్వరగా పూర్తి చేయుటకు ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ వహించి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎంపీడీఓలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయుటలో నిర్లక్ష్యం వహించకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ దిలీప్ కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్, అడిషనల్ పిడి నీరజ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin