సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక కార్యాలయంలో భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ నూతన భద్రాద్రి జిల్లా కమిటీ ఎన్నిక బుధవారం ఏకగ్రీవంగా జరిగింది .కమిటీ సభ్యుల అంగీకారంతో భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ నూతన కమిటీ వేసుకున్నారు .ఈ సందర్భంగా అధ్యక్షురాలు కందుల సుజాత మాట్లాడుతూ సారపాక గ్రామంలో అనేకమంది పేద మహిళలు ఉన్నారని వారందరూ కూడా రోజురోజుకు పెరుగుతున్న ధరలతో కుటుంబాలు పోషణ కష్టంగా ఉందని మహిళలందరూ తమ తమ కాళ్ళపై నిలబడేందుకు ఐటిసి, స్వచ్ఛంద సంస్థ లు సహకారం అందించాలని ,ఉపాధి అవకాశాలు స్థానిక మహిళలకు ,యువతకు కల్పించాలని కోరారు. ఈ ఫౌండేషన్ ద్వారా స్థానిక సమస్యలు, మహిళల సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తుందని మహిళలు అందరూ అన్ని రంగాల్లో ముందుండాలని అందుకు ఈ సమస్త తమ సహకారం అందిస్తుందని ప్రధాన కార్యదర్శి గంపల రవి కుమారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు భవాని ,జాయింట్ సెక్రెటరీ విజయ్ కుమా రి,కోశాధికారి పర్వీన్, సహాయ కోశాధికారి సుమతి, సభ్యులుగా స్రవంతి,లకుమాదేవీ, మేరీ ,లక్ష్మి ,ప్రియ ,జయ,శాంతి, భాగ్యం, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin