సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : పారిశుద్ధ్యం తోనే పట్టణ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 18 వ వార్డులో సీసీ రోడ్డు శంకుస్థాపన చేసి స్వచ్చ భారత్ దివస్ , ఇండియన్ స్వచ్చత లీగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఆర్పిల కష్టాలను గుర్తించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్పీలకు వేతనాలను పెంచి ఆర్పీల పట్ల వారికున్న అభిమానాన్ని చాటటం జరిగిందని అన్నారు.పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల్లో ఉన్న వ్యర్థాలను తొలగించి పట్టణాలు సుందరంగా తీర్చుదిద్దుకోవడం జరిగిందని ఇటీవల సీఎం కేసీఆర్ 25 కోట్లు కేటాయించడం దానికి సంబంధించిన జీవోను కూడా అందించడం జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సహకారంతో నియోజక వర్గం అభివృద్ధి పదంలో ముందుందని అన్నారు. ఎక్కడికి వెళ్లినా గ్రామాల్లో గతంలో మురుగునీరు ప్రత్యక్షమై వ్యాధులు ప్రభలించవని అన్నారు కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా సిసి రోడ్లు డ్రైనేజీలు ప్రత్యక్షమవుతున్నాయని అన్నారు. దీనివల్ల అంటు వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని తెలిపారు..అక్టోబర్ 1 న ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వచ్ఛత హి సేవ,,, ఏక్ తారీక్,, ఏక్ గంట,, శ్రమధన్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
-----------------------
Admin