సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రజారోగ్యం కోసం వార్డుల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్విని చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. షాద్ నగర్ లో ఏబీవీ దవఖాన ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో స్థానిక కౌన్సిలర్ కానుగు అంతయ్యతో కలిసి పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను స్థానిక ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన డాక్టర్లను శాలువాతో సన్మానించారు.
-----------------------
Admin