Wednesday, 29 July 2026 12:37:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్హులందరికీ దళితబందు, పక్కాగృహలు ఇవ్వాలి... -ఎంపిటిసి మీసాల ఉపేందర్

Date : 01 July 2023 02:56 AM Views : 425

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నిరుపేద కుటుంబాలకు చెందిన వారందరికీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితబంధు,గృహలక్ష్మి పథకాలు అందించి వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని ఎంపిటిసి మీసాల ఉపేందర్ కోరారు.శుక్రవారం నాడు నాగిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ ఆవాస గ్రామం బెట్టేగుడెంలో రెవెన్యూ శాఖ అధ్వర్యంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవం లో పాల్గొని మాట్లాడారు.గ్రామంలో దళితులు రోజు వారి కూలి పనులు చేసి దుర్బర పరిస్ధితులను ఎదుర్కొంటున్నారని,చాలామందికి పక్క గృహాలు లేవని వారందరికీ దళితబంధు, గృహలక్ష్మి పథకాలు అందించాలని, చాలా కుటుంబాల వారు వివాహం అయి పిల్లలు ఉన్నవారికి కూడా ఆహార భద్రత కార్డులు ప్రభుత్వం మంజూరు చేయలేదని, కాని గృహలక్ష్మి పథకానికి ధరఖాస్తుకు ఆహారభద్రత కార్డు ఉండాలని నిబంధన ఉండటంతో చాలా మంది అవకాశం కోల్పోతున్నారని ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు.గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని,గ్రామస్తులు ప్రభుత్వ విద్యా,ఆరోగ్య, ఇతర సేవలను వినియోగించుకోవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్ఐ చిలక రాజు నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి అనూష,ఫీల్డ్ అసిస్టెంట్ కోటయ్య, ఆరోగ్య సిబ్బంది నాగేంద్ర,కవిత,ఉపసర్పంచ్ మంద కవిత,గ్రామ పెద్దలు మంద నాగయ్య, మంద సైదులు, ముల్కలపల్లి శ్రీను,అరోను,కోటయ్య, సైదిరెడ్డి,మరియదాసుమహిళలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :