సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు శ్రీ విజ్ఞాన్ సి.బి.ఎస్.సి. స్కూల్ లో చదువుతున్న 6 గురు విద్యార్థిని విద్యార్థులు తమా ప్రతిభను కనుపరిచారు, హైదరాబాద్ లో యూసుఫ్ గూడ లో గలా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కోలోనిల్ సంతోష్ బాబు మెమోరియల్ జాతీయ ఓపెన్ కరాటే, కుంఫు ఛాంపియన్షిప్ 2022 సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమీ సైదులు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి, ఈ పోటీలలో సుమారు 2500 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు, ఈ పోటీలకు ముఖ్య అతిధులుగా సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఛైర్మన్ సుమన్ తల్వార్, భాను చందర్ వచ్చి కరాటే టోర్నమెంట్ ను ప్రారంభించారు, క్రీడాకారులను కరాటే క్రీడా గురించి అందులోని గొప్ప తనాన్ని క్రీడాకారులకు వివరించారు ఈ పోటీలలో ఓబుల దేవర చెరువు శ్రీ విజ్ఞాన్ సి.బి.ఎస్.సి. స్కూల్ లో చదువుతున్న 6 గురు విద్యార్థిని విద్యార్థులు తమా ప్రతిభను కనుపరిచారు, ఇందులో నవీద్,నిసార్,తేజ శ్రీ రెడ్డి, ప్రాణవి,శ్రీ వర్శిని స్వర్ణ పతకాన్ని నేహా అంజూమ్ వెండి పతకాన్ని సాధించారు కరాటే పోటీలలో పాల్గొని మెడల్స్ సాధించిన విద్యార్థులకు కరస్పాండెంట్ k.మస్తాన్ *విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ చదువుతో పాటు క్రీడలు కూడా మనకి ముఖ్యం అని కరాటే ఆత్మ రక్షణ, ఆత్మ విశ్వాన్ని, ఆత్మ ధైర్యాన్ని, శారీరక ధృఢత్వం, ను పెంపోందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అకాడమీ పుష్ప, ప్రిన్సిపల్ అడ్మిన్ వర్గీస్, ఆకాడమిక్ కోఆర్డినేటర్ ఫర్యాజ్, కరాటే మాస్టర్ షాకిర్, వ్యాయమ ఉపాధ్యాయులు రాము, ఉపాద్యాయ బృందం స్కూల్ విద్యార్థులు గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
-----------------------
Admin