సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బుల సౌజన్య, జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టిన తర్వాత మాట్లాడుతూ ప్రీతిని వేధించిన మృతికి కారకులైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్నం చేసిన కేఎంసి పిజి విద్యార్థిని ప్రీతి ఐదు రోజులపాటు పోరాడుతూ మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు, గిరిజన కుటుంబానికి చెందిన ప్రీతి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ప్రతిష్టాత్మక వైద్య విద్యను కొనసాగిస్తూ సైఫ్ వేధింపులకు తాళలేక ఇలా నిస్క్రూమించడం చాలా విషాదకరం, సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ తనను వేధిస్తున్నారని ప్రీతి పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని కేఎంసి ప్రిన్సిపాల్ హెచ్ ఓ డి మరియు స్థానిక పోలీసులు విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నియంత్రించలేని రాష్ట్ర ప్రభుత్వం ఈ మృతికి పూర్తి బాధ్యత వహించాలని అన్నారు , ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రీతి అపస్కారక స్థితిలో ఉన్నప్పుడు తన మొబైల్ ఉపయోగించి కేసులు నీరుగాచడానికి ప్రయత్నించిన వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, ఉన్నత విద్యారంగంలో అట్టడుగు వర్గాల విద్యార్థులకు ప్రవేశించడానికి జీవించలేకపోతున్నారు సామాజిక సృహ లేని కొన్ని ఉన్నత విద్యాసంస్థలు కుల వివక్షత కేంద్రాలుగా మారిపోయాయని ఈ నేర సంస్కృతిని పెంచి పోషించిన కాకతీయ మెడికల్ కళాశాల పాలన అధికారులు సరైన పర్యవేక్షణలో చేయకుండా ఏసీ గదుల్లో కూర్చుని మెడికల్ కళాశాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న కాళోజి హెల్త్ యూనివర్సిటీ అధికారులు తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు, ప్రీతి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు, ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల ఎక్స్గ్రేషియా కాదు ఒక కోటి రూపాయలు ఎక్స్గ్రీషియా అందించాలని డిమాండ్ చేశారు, ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సభ్యులు మహమ్మద్ జావిద్ మాట్లాడుతూ.... ప్రీతి కుటుంబానికి సహాయ సహకారాలు అందించి అన్ని రకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు... ర్యాగింగ్ వల్ల ప్రీతి ఆత్మహత్యకు కారణమైతే కొంతమంది రాజకీయ నాయకులు లవ్ జిహాద్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరావు టిపిసిసి సభ్యులు ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం టిపిసిసి సభ్యులు వడ్డే నారాయణరావు ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య రెండో డివిజన్ కార్పొరేటర్ మా లేదువెంకటేశ్వర్లు ఐదో డివిజన్ కార్పొరేటర్ పల్లబోయిన భారతి చంద్రం ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ లకావత్ సైదులు 55వ డివిజన్ కార్పొరేటర్ ఎండి రఫీదా బేగం రఘునాథపాలెం మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుంటముక్కల నాగేశ్వరావు ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు దామ స్వరూప ఏలూరి రజిని ధరావత్ దివ్య పుష్ప లాల్ బి శంకర్ నాయక్ రూరల్ మండలం మహిళ అధ్యక్షురాలు సంధ్య ఖమ్మం ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ నగర ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు అబ్బాస్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కిసాన్ అధ్యక్షులు ముక్క శేఖర్ గౌడ్ ఖమ్మం నగర ఓబీసీ సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్ మిక్కిలి నరేంద్ర రాజి పార్వతి శీను బానోతు రాజు నాయక్ యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మరియు ఖమ్మం జిల్లా మరియు సిటీ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....
-----------------------
Admin