సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల 50వ వర్ధంతిని పురస్కరించుకొని నేడు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో జరుగు ఘంటసాల పాటల పోటీలను విజయవంతం చేయాలని శ్రీ జ్ఞాన సరస్వతి సాంస్కృతిక కళావేదిక అధ్యక్ష కార్యదర్శులు బుర్రి వెంకటేశ్వర్లు గుండా రమేష్ లు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పి నాగభూషణంకు ఈనెల 11న ఘంటసాల వర్ధంతి సందర్భంగా జరుగు స్వరాభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాటల పోటీల్లో గెలుపొందిన వారికి రెండు విభాగాల్లో ప్రధమ బహుమతిగా రూ .2500 నగదు, ద్వితీయ బహుమతిగా రూ.1500 నగదు తృతీయ బహుమతిగా రూ.1000 రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రములు ఈ నెల 11 ఘంటసాల వర్ధంతి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు బాలాజీ బాంకెట్ హాల్లో జరుగు స్వరాభిషేకం కార్యక్రమంలో అందజేస్తామని తెలిపారు. పాటల పోటీలకు న్యాయ నిర్ణేతలు గా పాడుతా తీయగా విశ్లేషకులు టి రాజా బాబు సాహితీ వేత్త కె వి ఎస్ కుమార్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కల్లూరి నాగయ్య లు వ్యవహరిస్తారని తెలిపారు. సంగీత ప్రియులు ఈ పాటలో పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నక్క శ్రీనివాస్ కార్యనిర్వాహక సహాయకులు గోపారపు రాజు, బచ్చు పురుషోత్తం పాల్గొన్నారు..
-----------------------
Admin