సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : హిందూపురంలో వరదలు.. తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు, నందమూరి బాలకృష్ణ పర్యటన.. ★ కబ్జాలు, ఆక్రమణలు పెరిగిపోయాయన్న బాలయ్య ★ అందుకే హిందూపురం వాసులకు వరద కష్టాలు అని వెల్లడి ★ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. *హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ. ★ హిందూపురం వరద ప్రాంతాల్లో పర్యటించానని, బ్రిడ్జిలు నిర్మించాలని ప్రజలు కోరారని వెల్లడించారు. ★ ప్రజల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని తెలిపారు. ★ బ్రిడ్జిల నిర్మాణంపై ప్రభుత్వం స్పందించకపోతే, టీడీపీ అధికారంలోకి రాగానే నిర్మిస్తామని స్పష్టం చేశారు. ★ వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బాలకృష్ణ అన్నారు. ★ భూ కబ్జాలు, ఆక్రమణలు పెరిగిపోవడం వల్లే హిందూపురం వాసులకు వరద కష్టాలు అని వెల్లడించారు. ★ బాలయ్య తన పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. ★ త్యాగరాజనగర్, చౌడేశ్వరి కాలనీ, ఆర్టీసీ కాలనీల్లో వరద బాధితులకు ఆహారం, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు.
-----------------------
Admin