సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని సన్యాసి బస్తిలో పెయింటర్ పనిచేస్తున్న ప్రవీణ్, అదే బస్తికి చెందిన లావణ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలం క్రితం అదే బస్తి కి చెందిన సుమన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది లావణ్య. ఈ విషయంపై దంపతులు ఇద్దరికి తరచూ గొడవ అయ్యేది. దీంతో ఇంటి నుండి వెళ్లిపోయిన లావణ్య అదే బస్తిలో ప్రియుడితో నివాసం ఉంటుంది. నా భార్యను వదిలేయాలని పలుమార్లు సుమన్ తో ప్రవీణ్ గొడవపడేవాడు. అయితే ఆదివారం మాట్లాడదామని రమ్మన్నాడు సుమన్. అక్కడికి వెళ్లిన ప్రవీణ్ పై తన భార్య ప్రియుడు కలిసి దాడి చేశారని తన చేయి మరియు కాలు విరగొట్టారని నడుము పైన నాపరాయితో దాడి చేశారని తన బంధువులు కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని చెప్పుకొచ్చాడు. భార్యపై మరియు ఆమె ప్రియుడు సుమన్ పై చర్యలు తీసుకోవాలని చెప్పాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం సమయంలో మరణించాడు....
-----------------------
Admin