సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఈరోజు ములుగు లో తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు జుబేరు పాషా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన నష్టాలను కష్టాలను వివరిస్తూ, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను, ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని ప్రొ. జయశంకర్ ప్రపంచమంతాట రగిలించారని ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించి, మొక్కవోని దీక్షతో సాహసోపేత పోరాటం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. జయశంకర్ సార్ ఆశించినట్లుగానే స్వయంపాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వారు చూపిన బాటలోనే బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నదని అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ, సకల జనుల అభ్యున్నతిని సాధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రొ. జయశంకర్ కలను సాకారం చేస్తున్నదని వారి యాధిలోనే యావత్తు దేశానికి ఒక రోల్ మోడల్గా రాష్ట్రం నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, పాల్గొన్నారు.
-----------------------
Admin