సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ న గర్ మున్సిపాలిటీ లో బాలికల ఉన్నత పాఠశాలలో దుస్తుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ గాయత్రి భాస్కర్ గారితో కలిసి పాల్గొని పాఠశాల కి కావలసిన మౌలిక వసతుల నీ అడిగి తెలుసుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా సంవత్సరం ఆరంభంలోనే పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ అందజేస్తుందని..... నాణ్యమైన విద్య అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని తెలపడం జరిగింది.అలాగే హుజూర్నగర్ నియోజకవర్గం లోని బాలికల ఉన్నత పాఠశాలలో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా తీసుకు వస్తున్నటువంటి గౌరవ అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.పాఠశాలకి అవసరమైన మౌలిక సదుపాయాలు, శానిటేషన్ నీ అందిస్తామని వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో 21 వార్డ్ కౌన్సిలర్ గాయత్రి భాస్కర్, ప్రధానోపాధ్యాయులు లతీఫ్ , వ్యాయామ ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి , అధ్యాపక బృందం జయప్రద తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin