సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ మేకల రాములు యాదవ్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనను పురస్కరించుకొని కొత్తగూడెం పట్టణం లో సమావేశ హల్లులోని సమావేశానికి హాజరైనారు. ఈ సమావేశాన్ని యాదవ హక్కుల పోరాట సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ బసనబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. ఈ సమావేశానికి విచ్చేసిన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ మేకల రాములు యాదవ్ వారిని భద్రాద్రి కొత్తగూడెం యాదవ హక్కుల పోరాట హక్కుల సమితి జిల్లా అధ్యక్షుల వారైన బసనబోయిన వెంకటేశ్వర్లు శాలవతో సన్మానించి, పుష్ప గుచ్చంతో ఆహ్వానించినారు. శ్రీ మేకల రాములు యాదవ్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో జనాభ ప్రతిభాదిత ప్రకారం యాదవులు 20% జనాభా కలిగి ఉన్నారు. ఇంత జనాభా కలిగి ఉన్న యాదవులకు చట్ట సభలు అయిన అసెంబ్లీ మరియు దేశవ్యాప్తంగా 40% జనాభా కలిగి ఉన్నట్టువంటి పార్లమెంట్ పదవులలో యాదవులకు అన్ని ప్రధాన పార్టీల వారు, యాదవులను, చిన్న చూపు చూస్తున్నారు. అందు వలన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ గారు అన్ని ప్రధాన పార్టీ వారికి డిమాండ్ చేయడం ఏమనగా స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు కావచ్చిన యాదవులకు తగిన ప్రాధాన్యం కల్పించడం లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలలో అభ్యర్థులను అధిక సంఖ్యలలో పోటీకి నిలపాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని ప్రముఖ పార్టీల వారు మొదట యాదవ నాయకులకు ప్రాధాన్యం కల్పించాలని అలాగే తెలంగాణ రాష్ట్రంలో యాదవ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి. దానికి ప్రతీ సంవత్సర బడ్జెట్ లో 10,000/- కోట్లు బడ్జెట్ కేటాయించాలని మరియు గతంలో ఉన్నటువంటి S,N,T రిజర్వేషన్ న్ని కూడా పునరుద్ధరించాలి అని కోరడం జరిగినది. మేము కోరిన హక్కులు ఏ రాజకీయ పార్టీ వారు అమలు పరిచినచో ఆ పార్టీ వారికి మా యాదవ కులస్థుల మద్దత్తు ఆ పార్టీ వారికి మద్దతు తెలిపి ఆ పార్టీ వారిని గెలిపించుకుంటాము అని తెలిపినారు. పోరాట సమితి జాతీయ ఈ సమావేశానికి యాదవ సంఘ నాయకులైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బసనబోయిన వెంకటేశ్వర్లు మరియు కొక్కు దేవేందర్ యాదవ్ (యాదవ హక్కుల ధికార ప్రతినిధి - సిరిసిల్ల), స్టాలిన్ యాదవ్, మాజీ కౌన్సిలర్ శ్రీ బూరుగుల శ్రీనివాసరావు యాదవ్, శ్రీ కాసరబోయిన అయిలయ్య యాదవ్, ఎల్లావుల శ్రీనివాస యాదవ్, కిషోర్ యాదవ్, నాగయ్య యాదవ్ మరియు యాదవ కులస్తులు అధిక సంఖ్యలో హాజరైనారు.
-----------------------
Admin