సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పాపిరెడ్డి కాలనీలో ఈరోజు మన బీ ఆర్ ఎస్ యువ నాయకుడు మరబోయిన రవి యాదవ్ పర్యటించి అక్కడ ఉన్న అండర్ పాస్ బ్రిడ్జ్ సమస్యపై గొంతెత్తి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ కావట్లేదు గత 20 ఏళ్ల నుండి ప్రతి ఒక్క నాయకుడు పదవిలో ఉన్నప్పుడు దాన్ని వచ్చి చూడడం జరుగుతుంది మంచి చేస్తామని చెప్పడం జరుగుతుందని ఇంతవరకు ఎటువంటి అధికారి గాని ఏ పార్టీ నాయకుడు గాని పట్టించుకోవడమే జరగలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి పార్టీలు మారుతున్నారు గాని ఎటువంటి ఒక్క నాయకుడు కూడా వచ్చి దాని మారుద్దాం అని చెప్పి ఒక అడుగు ముందుకు వేయడం జరగట్లేదు. ఎంతో మందికి రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఎంతోమంది ఈ పాపి రెడ్డి కాలనీ వాసులకు మరియు వలస వచ్చిన కూలీలే వాళ్లకు సహాయం చేయకపోగా వాళ్ళని ఇంకా ఇబ్బందులు ప్రభుత్వం గురిచేస్తుంది. ఎమ్మెల్యేలు కార్పరేటర్లు పదవి కోసం పాటలు పడుతున్నారు గాని ప్రజల కోసం ఏమాత్రం ఆలోచించడం లేదు. హైడ్రా పేరుతో నిరుపేద ఇల్లులను కూలగొట్టడం వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు తప్ప దానివల్ల ఏమి మంచి జరుగుతుంది అని గొంతు ఎత్తి ప్రశ్నిస్తున్నాను. రోజుకి 30 వేల నుండి 40000 మంది ప్రజలు వెళ్లేదారి దాని పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఈ నాయకులకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెబుతుంది. 2021 లో 20 లక్షలు పెట్టి మరమ్మత్తులు చెప్పించారని చెప్పారు మన ఎమ్మెల్యే గాంధీ. మరి 20 లక్షలు పెడితే ఇది ఇలానే ఉంటుందా అని మరబోయిన రవి యాదవ్ ప్రశ్నిస్తు ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్య మాటలు చెప్పుతూ ముందుకు సాగుతూ పోతున్నారు ఇప్పటికైనా మీ గల్ల పెట్టెలు నింపుకోకుండా ప్రజల కోసము ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి ముందుకు రావాలని కోరుతున్నాను. ఈ అండర్పాస్ బ్రిడ్జి సమస్య పరిష్కరించకపోతే ఇంకా పెద్ద ఎత్తున అందులోనా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరియు కార్పొరేటర్ ఇంటిని ముట్టడిస్తాము. అదేవిధంగా మన జాతీయ రహదారికి అనుసంధానంలో ఉన్న శేరిలింగంపల్లి ప్రధానమైన అండర్ పాస్ బ్రిడ్జి కింద కూడా ఈరోజు పర్యటించడం జరిగింది అండర్ పాస్ పనులు జరుగుతున్నాయి అని ప్రజలుకు చెబుతూ కనీసం భద్రత చర్యలు చేపట్టకుండా హలాగేయ్ రైట్ సైడ్ కాలువను తెరిచి ఉంచారు.ఎవరైనా దురదృష్టవశతం ఏ వాహనం గానీ తెరిచి ఉన్న కాలువలో పడితే ఆ గుంతలో మనిషి కనిపించేనంతగా లోతుగా కలవ ఉంది . అయినా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు రోజుకి మూడు నుంచి నాలుగు లక్షల వాహనాలు ఐటి ఉద్యోగులు, స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు, ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశం ఆయనే ఈ ప్రభుత్వం ఎటువంటి వాటిని చర్య తీసుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా నిమ్మకు నీరెట్టినట్టే ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది. అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు అందించకుండా ఎంతో ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ కార్యక్రమంలో కే. ఎన్ రాములు,రాజేశ్వరమ్మా, లింగం శీను,బయ్య మల్లేష్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్,ప్రసాద్, శ్రీశైలం యాదవ్,నవీన్ గౌడ్, చారి, గడ్డం శ్రీను, ప్రభాకర్ గౌడ్,రాజు, రమాదేవి, శశికల,సుజాత గౌడ్,స్వరూప,దివ్య, నీరూప,సుజాత, సాయి నందన ముదిరాజ్, పట్లోళ నరసింహా రెడ్డి,రెవెళ్ల జమ్మయ్య తదితరులు పాలుగోన్నారు...
-----------------------
Admin