సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికై జులై 4 .5 మండల కేంద్రాలలో టోకెన్ సమ్మెలు 6న కలెక్టరేట్ ధర్నా అప్పటివరకు సమస్యలు పరిష్కరించకపోతే జులై 10నుండి నిరవధిక సమ్మె చేస్తున్నామని విద్యాశాఖ అధికారి డిఇఓ సూపర్డెంట్ జ్యోతి గారికి సమ్మె నోటిస్ అందజేయడం జరిగినది ఈ సందర్భంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు జి పద్మ మాట్లాడుతూ 2022 మార్చిలో అసెంబ్లీలో వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించినప్పటి నుండి ఏరియర్స్ తో సహా చెల్లించాలి. కొత్త మెనూకి బడ్జెట్ పెంచాలి పెండింగ్ బిల్లులు తక్షణ విడుదల చేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 2022 మార్చి 15న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 2000 రూపాయల వేతనం పెంచుతున్నట్లు ప్రకటించారు కానీ నేటికీ 18 నెలలు అయినప్పటికీ ఇప్పటికీ వేతనాల జీవో అమలు చేయక పోవడం సరికాదని అన్నారు జీవో ఏం ఎస్ నెంబర్ 8 విడుదల చేసినప్పటికీ ఆ జీవోలో నిర్దిష్టంగా ఎప్పటినుండి జీవో అమలు చేస్తారో స్పష్టత లేదు కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుండి నేటి వరకు ఏరియర్స్ తో సహా చెల్లించాలని పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే ఇవ్వాలి మధ్యాహ్న భోజన నిర్వహణకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులే తక్కువ అవి కూడా నెల నెల ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి దీంతో కార్మికులు అప్పులు చేసి వంట చేయడంతో అప్పుల పాలై త్రివ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అప్పుల ఊబిలో ఊరకపోతున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని 4 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులు జీతాలు ఇవ్వాలని ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న కోడిగుడ్డు బిల్లులు ఇవ్వాలని పెంచిన జీతాలు విడుదల చేయాలని 10 నెలల ఏరియాస్ తో ఇవ్వాలని కోడిగుడ్లను ప్రభుత్వమే సరపరచేయాలని గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని కాటన్ బట్టలు యూనిఫామ్ గా ఇవ్వాలి మెనూ చార్జీలు పెంచకుండా కొత్త మెనూ అమలు చేయలేమని కొత్త మెనూ ప్రకారం బిల్లులు ఇస్తానే కొత్త మెనూ అమలు చేస్తామని ఈ ఈ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నామని సమ్మె నోటీస్ ఇచ్చిన వారిలో మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసమ్మ సహాయ కార్యదర్శి శివమ్మ జిల్లా కమిటీ సభ్యులు రమాదేవి సక్కు భాయి రాణీ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin