సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం మూడు రోడ్లుల కూడలి వద్ద, ఏర్పాటు చేసిన వైయస్సార్ విగ్రహాన్ని ఓ ఎరువుల లారీ ఢీకొన్న ఘటనలో విగ్రహంవద్ద వున్న ఐదుగురికి గాయాలయ్యాయి, నల్లమాడ నుంచి ఎరువుల బస్తాలతో టుoకూర్ కు వెళ్తున్న లారీకి ఓ.డి.సి ఐటిఐ కళాశాల దాటిన తర్వాత స్టీరింగ్ లాక్ అయింది, లారీని నిలుపుదల చేయకుండా అక్కడి నుంచి డ్రైవర్ అలాగే ముందుకు నడపడంతో వైయస్సార్ కూడలి మలుపు వద్ద డౌన్ లో వేగం నియంత్రణ కాక వైయస్సార్ విగ్రహాన్ని ఢీకొంది. ఈ ఘటనలో వైయస్సార్ విగ్రహం వద్ద ద్విచక్ర వాహనాలపై ఆగి ఉన్న ఇద్దరికి, పక్కనే ఆటోలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వైయస్సార్ విగ్రహం పూర్తిగా ధ్వంసం అయింది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్ని అదుపులోకి తీసుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
-----------------------
Admin