Friday, 08 May 2026 11:47:55 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఓ బూటకం...

Date : 25 March 2023 08:23 AM Views : 523

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పంట నష్టంపై ప్రభుత్వం ప్రకటించిన పరిహారం బూటకమని రైతులు పెట్టిన పెట్టుబడికి ఎటూ సరిపోదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ఆరోపించారు.ఈ మేరకు శుక్రవారం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ తో కలిసి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.రైతు పెట్టిన పెట్టుబడిలో కనీసం 50శాతం నష్టాన్ని ప్రభుత్వం భరించలేక పోవడం సిగ్గు చేటని తెలిపారు.ప్రభుత్వం ప్రకటించిన 10వేల రూపాయలతో ఒక్క సారి దుక్కి దున్నడానికి సరిపోదని విమర్శించారు. కేసీఆర్ కు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే కౌలు రైతులకూ రైతు బంధు వర్తింప జేస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.అంతే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగ రైతులపై బ్యాంకర్ల దాడులు పెరిగాయని, రైతుల ఇండ్లకు వెళ్లి రుణాలు కట్టాలని వేదిస్తు ఇండ్లకు తాళాలు వేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే రుణ మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హామీ ప్రకటనలకే పరిమితం అవుతుందని ఇంత వరకూ రుణ మాఫీపై స్పష్టత లేదని అన్నారు.ఖమ్మం మిర్చీ మార్కెట్ లో దళారుల ఆగడాలు మితిమీరి పోతున్నాయని రైతలను నిలువునా దోచుకుంటున్నారని అన్నారు. ఇటీవల కాలంలో స్థానిక మంత్రే స్వయంగా క్వింటకు 25వేల రూపాయలుగా జెండా పాట ప్రకటించి అందరి దగ్గర అదే ధరతో కొంటామని చెప్పి 15 నుండి 17వేలకు మాత్రమే కొనుగోలు చేయడం రైతులను మోసం చేయడం కాద అని ప్రశ్నించారు.మంత్రి పర్యటించిన తర్వాతే మార్కెట్లో దళారులు రెచ్చి పోతున్నారని అన్నారు. స్థానిక బీఆర్ఎస్ నేత ఎమ్మేల్సి తాత మధు సుధన్ సోయి లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న మా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కని విమర్శించే స్థాయి ఆయనకు లేదని హితవు పలికారు. సీఎల్పీ నేతగా రాష్ట్రమంతా తిరిగే అర్హత మల్లు భట్టి విక్రమార్క కు ఉందని ఈ మాత్రం జ్ఞానం లేకుండా విమర్శించడం సిగ్గు చేటని అన్నారు.పదవులు కొనుక్కునే వారు ప్రజా నాయకులను విమర్శించే ముందు ఆలోచించి మాట్లాడాలని ఎద్దేవా చేశారు.చేత నైతే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ని సత్తా ఏంటో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటనకు రావడానికి కారణం కూడా మల్లు భట్టి విక్రమార్కే అని అన్నారు. మా నాయకుడు సీఎల్పీ నేత పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ బోనకల్, చింతకాని మండలాల్లో పర్యటించి బాధితులను పరామర్శించి బాధితుల పక్షాన పోరాటం చేయబట్టే సీఎం ఫాంహౌస్ విడిచి వచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను విమర్శించే ముందు ఆలోచించి మాట్లాడాలని అన్నారు. గత ఏడాది గోదావరి పరివాహాక జిల్లాలో ప్రకటించిన 10వేల పరిహారం ఇంకా పూర్తి స్థాయిలో లబ్ధి దారులకు అందలేదని బోనకల్ లో ప్రకటించిన పరిహారం అలా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: