సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నిజాంబాద్ లోని ఆర్ .అండ్. బి అతిథి గృహంలో ఎస్సీ ఉపకుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ ఒక కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత పథకం చాలా ఆదర్శవంతమైన పథకమని అందుకు కేసిఆర్ గారిని అభినందించక తప్పదని కాని దళితుల అభివృద్ధి కోసం చేపట్టిన దళిత బంధు మాల మాదిగల బంధుగా ఉందని అది దళిత బంధుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో బుడగజంగాలు, చిందులు, మోచి లు మాస్టీన్ లు, డక్కలి, సమగర్ మోచి, బాయిoల్ల, గోసంగి, ఇంకా అనేక (57 )కులాల ప్రజలకు దళిత బంధు అందడం లేదని ప్రతి నియోజకవర్గంలో ఇచ్చిన వద్ద మంది ల ఒక్క ఉపకులానికి చెందలేదని వారికి ఇవ్వలేదని వాపోయారు ఇప్పటికైనా కేసీఆర్ గారు మా(30 లక్షల) ఉపకులాల ప్రజలపై దృష్టి సారించి దళిత బందులో వాటకై తమిళనాడు తరహా లోమూడు శాతం ప్రత్యేక జీవో జారి చేసి అందులో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాదిగ సంఘంల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమున్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో భాగంగా వేసిన శ్రీకృష్ణ కమిటీ ఉమ్మడి రాష్ట్రంలో పర్యటించినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మాదిగలు తెలంగాణ కావాలని లేఖలు అందజేశారని ఆంధ్రలో, రాయలసీమలో కూడా తెలంగాణ ఇవ్వాల్సిందే అని శ్రీకృష్ణ కమిటీ లేఖ ద్వారా అందజేశారని అదే ఇతర కులాల ఇక్కడ తెలంగాణ అంటే అదే కులం ఆంధ్రలో రాయలసీమలో తెలంగాణ ఇవ్వద్దు అని లేఖలు అందించారని మూడు ప్రాంతాల్లో మాదిగలు మాదిగ ఉపకులాలు తెలంగాణకు మద్దతుగా నిలిచియి నీ స్వయంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక 219వ పేజీలో ప్రచురించబడిన సంగతి గుర్తుచేస్తూ అలాంటి వారు అయిన మాదిగ మాదిగ ఉప కులాల సరైన గుర్తింపు ఈ రాష్ట్రంలో రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత మాదిగ భవన్ మాల భవన్ ఉపకులాల భవన్ అన్నారు. కాని ఇంతవరకు నోచుకోలేదు అని వాపోయారు. కోట్లు ఖర్చుపెట్టి భవనాలు నిర్మించుకుంటే దమ్మున్న వారికి రెడ్డి భవనాలు రెడ్డి కార్పొరేషన్ వైశ్య కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ లు పూర్తి అయితే ఎప్పుడో ప్రకటించిన మాల భవన్ మాదిగ పాన్ ఉపకులాల భవన్ లు ఎందుకు పూర్తి చేయలేదో చేయాలనుకుంటే తక్షణమే అది శాఖగా ప్రభుత్వం అడుగులు వేయాలని అంతేకాకుండా ఎస్సీ కమిషన్ రిటైర్మెంట్ ను నియమించాలని కొక్కెర భూమన్న ప్రభుత్వాన్ని కోరారు. ఇట్టి కార్యక్రమంలో ఏర్పుల యాదయ్య బయిoడ్ల, చిందు నంబూద్రి, ప్రసాద్, కర్నె ముత్యాలు, డక్కలి, చిత్తరి సాయమ్మ, సాయి ప్రసాద్, గంగాధర్,ఎల్లవ్వ,కండమారి సాయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin