సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రం లో ఐటిఐ సమీపంలోని నల్లమాడ మండలం రెడ్డిపల్లి నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. నల్లమాడ మండలానికి చెందిన వ్యాపారి రంగారెడ్డి ఐషర్ వాహనంలో బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు 14 టన్నుల రేషన్ బియ్యం, ఐచర్ వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది.... ముదిగుబ్బ మండల, నల్లమాడ మండలం, ఓబుల దేవర చెరువు మండలం నుంచి నిత్యం కర్ణాటకకు రేషన్ బియ్యం అక్రమంగా వెళుతూనే ఉంటాయి. అడపాదడపా తనిఖీలు చేస్తున్న అధికారులు పెద్ద మొత్తంలో పట్టుబడినా తక్కువ మొత్తంలో పట్టుబడినట్లు చూపించి వ్యాపారుల వద్ద మామూళ్లు తీసుకుంటున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టుబడిన బియ్యాన్ని సైతం అధికారులు ఏం చేస్తున్నారన్నది లెక్క చెప్పకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కొందరు వ్యాపారులు బహిరంగంగానే సంబంధిత అధికారులకు మామూళ్లు ఇస్తున్నామని ఏం చేసుకుంటారో చేసుకోండి అని చూస్తుంటే అక్రమ వ్యాపారం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోండి. వ్యాపారం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.... పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఇలా పక్కదారి పడుతున్నా, అధికారులు చోద్యం చూస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి....
-----------------------
Admin