సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం డివిజన్లో ఖాళీగా ఉన్న 190 పైగా రేషన్ షాపులను తక్షణం నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని రేషన్ షాపులో రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ తప్పక అమలు చేసి చదువుకోని ఖాళీగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఉపాధి అవకాశం చూపెట్టే విధంగా మీ ద్వారా తక్షణం నోటిఫికేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు భద్రాద్రి, ఫిజికల్ హ్యాండీక్యాప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఊటుకూరి సాయిరాం భద్రాచలం ఆర్డీవో శ్రీ రత్న కళ్యాణి కి దరఖాస్తు ఇవ్వడం జరిగింది . దీనికి స్పందించిన ఆర్డిఓ రత్న కళ్యాణి డివిజన్లో ఖాళీగా ఉన్న రేషన్ షాపులకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న రేషన్ షాపులను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నం సత్తిబాబు, కంభంపాటి రామ ,రుద్రయ్య, మద్దెల లక్ష్మయ్య, నానిపెళ్లి శ్రీనివాస్, ఊటుకూరి సాయికృష్ణ ,ఆనంద్, చైతన్య ,కృష్ణకుమారి ,అనూష తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin