సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి మండల విద్యాశాఖ అధికారి కె చిన్న కృష్ణ ను సస్పెండ్ చేస్తూ ఆర్.జె.డి ఉత్తర్వులు జారీ చేసినట్లు శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారిణి తెలిపారు. ఈనెల 7న ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్య కడప వారు కదిరి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సందర్శించి ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పంపిణీ లో జాప్యము విక్రయపుస్తకాల పంపిణీ రికార్డులను నిర్వహించకపోవడము. ప్రైవేటు పాఠశాల గుర్తింపు రెన్యువల్ దస్త్రాల సమర్పణలో అలసత్వం చేయడం విక్రమ పుస్తకాలు పంపిణీ రికార్డులను నిర్వహించకపోవడము . ప్రవేట్ పాఠశాల గుర్తింపు రెన్యువల్ దస్తాల సవరణలో జాప్యము. ఉపాధ్యాయులు సెలవుల ఇతర విషయాలు సర్వీస్ రిజిస్టర్ ల యందు నమోదు. చెయక పోవడము మరియు టూర్ డైరీ మరియు సందర్శన నివేదికలు ఉన్నత అధికారులకు సమర్పించక పోవడము తదితర వైఫల్యాలు మరియు విధి నిర్వహణలో అలసత్యము కారణాలతో కదిరి మండల విద్యాధికారి అయిన కె చిన్న కృష్ణ ను ఆర్ జె డి కడప వారు విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగినది .జిల్లా విద్యా అధికారిణి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వారు తెలియజేశారు.
-----------------------
Admin