Wednesday, 29 July 2026 05:21:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా...

Date : 11 July 2023 01:30 AM Views : 279

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నిబంధనకు విరుద్ధంగా అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల సీజ్ చేయాలి అని పాఠశాల ముందు, కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి పట్టుకున్న పాఠ్యపుస్తకాలతో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం పిడిఎఫ్ యూ,ఎస్ ఎఫ్ ఐ, ఏఐఎస్ఎఫ్ సూర్యాపేట జిల్లా కమిటీల ఆధ్వర్యంలో అందజేశారు .అనంతరం పి డి ఎస్ యూ జిల్లా అధ్యక్షుడు పోలేబొయిన కిరణ్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్ వర్మ, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగాని రవి లు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రం లో శ్రీ చెత్యన పాఠశాల అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతుంటే పట్టించుకోకుండా కార్పొరేట్ విద్యా సంస్థలకు సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారులు కొమ్ముగాస్తున్నారు అని అన్నారు . ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నాలుగు వేల నుంచి 12 వేల వరకు పాఠ్య పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల దోపిడీ చేస్తున్న, పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న అధికారాలు పట్టించుకోపోవడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు స్కూల్ ఫిజుల పేరుతో లక్షల రూపాయలు కాకుండా టైం, బెల్ట్, పరీక్షల ఫీజుల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న జిల్లా విద్యాధికారి ఎక్కడ కూడా తనిఖీ చేయకుండా స్పందించకుండా, చర్యలు తీసుకోకపోవడం వల్లనే కార్పొరేట్ శ్రీ చెత్యన పాఠశాల తన ఇష్టానుసారంగా పాఠ్యపుస్తకాలను అక్రమంగా అమ్ముతుందని అన్నారు .పాఠ్య పుస్తకాలు పట్టుకొని గుర్తు చేసినా కూడా విద్యాధికారులు పట్టించుకోకపోవడం అంటే శ్రీ చైతన్య కుక్క బిస్కెట్లకు కక్కుర్తి పడి అవినీతికి పాల్పడుతున్నారు. శ్రీ చైతన్య పాఠశాల ను సీజ్ చేసి, యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ పాఠశాలను సీజ్ చేయమని డిఈఓ కి చెప్పడం జరిగింది.తక్షణమే డిఇఓ గారు పాఠశాలలను సీజ్ చేయాలి లేని ఎడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమం లో వినయ్, ప్రవీణ్, వంశీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :