సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం పాత దొనబండ తండా గ్రామపంచాయతీ అంగన్వాడి కేంద్రం కు వంట సామాగ్రి, వాటర్ క్యాన్, స్,పిల్లలకు అక్షరాభ్యాసం చేయుటకు పలకలను దాతగా బాణోతు బాలాజీ నాయక్ తండ్రి మందా ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు చిన్నపిల్లలను అంగన్వాడి కేంద్రానికి పంపించాలని తల్లిదండ్రులను కోరారు. తద్వారా అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు చదువుతోపాటు, పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తారని, పిల్లలకు మానసిక ఉత్తేజాన్ని, కలిగించేందుకు వారికి ఆట - పాటలు నేర్పిస్తారని, తెలిపారు. గర్భిణీ స్త్రీలు అంగడి కేంద్రంలో ఇవ్వబడే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం అంగన్వాడి టీచర్ జ్యోతి, మరియు ఆయా సుజాత ను శాలవతో కప్పి ఘనంగా సత్కరించారు. అంగన్వాడి టీచర్ జ్యోతి వారి కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బాలు, వాలియా, బాబు, భాష, నరేష్ ,గోవిందు ,స్వామి, నరసింహ, హుస్సేన్ ,జగన్, రాజు, సురేష్ ,బద్రు ,నాగు ,కోట, నాగరాజు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin