సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు దుండిగల ఎల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి భారతీయ జనతా పార్టీ మఠంపల్లి మండల సభ్యత్వ నమోదు కార్యక్రమ వర్క్ షాప్ ను నిర్వహించారు.ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి హాజరైనారు.ఈ విధంగా వారు మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని సెప్టెంబర్ మొదటివారం నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ సమన్వయంతో పనిచేసి మఠంపల్లి మండలంలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు చేయాలన్నారు.100 సభ్యత్వాలు చేసిన వారికే క్రియాశీలక సభ్యత్వం వస్తుందని క్రియాశీలక సభ్యత్వం వచ్చిన వారికే మండల, జిల్లా స్థాయిలో పదవులు వస్తాయని కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి పోలింగ్ బూత్ లో సభ్యత్వాలు చేయాలన్నారు.ఈ సందర్భంగా మట్టంపల్లి మండల బిజెపి సభ్యత్వ ఇన్చార్జిలుగా పందిరి నరసింహ రెడ్డి, రావుల హుస్సేన్, భూక్య శివాజీ లను నియమించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్,ఆరాల సైదులు,ఆరాల అంజి,సాముల నరసింహారెడ్డి, గుండె పొంగు కొండలు, భానోత్ బాలు, పందిరి నరసింహారెడ్డి, గుండా కోటేశ్వరరావు, సైదా నాయక్,స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin