Wednesday, 29 July 2026 08:14:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అవకాశం ఇస్తే అభివృద్ది చేసి చూపిస్తా...

Date : 23 November 2023 07:38 AM Views : 247

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో బిజెపికి ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని భారతీయ జనతా పార్టీ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి అందె బాబయ్య స్పష్టం చేశారు. బుదవారం నియోజకవర్గంలోని కొందుర్గు మండలంలోని రేగడి చిలకమర్రి, ముట్పూర్, చుక్కమేట్, టేకులపల్లి, ఉత్తరాస్ పల్లి, భైరంపల్లి గ్రామాల్లో బిజెపి విస్తృత ప్రచారం చేపట్టారు. అభ్యర్థి అందె బాబయ్యతో పాటు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కమ్మరి భూపాల చారి జిల్లా కార్యవర్గ సభ్యులు చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ళ నర్సింహ మాదిగ, కొందుర్గు మండల అధ్యక్షులు కొమరబండ శ్రీశైలం, సీనియర్ నాయకులు ఈసారి సత్యం, కొందుర్గు మాజీ మండల అధ్యక్షులు బోయ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందే బాబయ్య, నర్సింహా డప్పుతో దండోరా వేశారు. అనంతరం బాబయ్య మాట్లాడుతూ.. అందరికి ఇచ్చారు అవకాశం.. బిజెపికి ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేసి నియోజకవర్గంలో సాగునీరు అందిస్తా, రైతుల పాదాలు తడుపుతా అన్నారు.షాద్ నగర్ నియోజకవర్గంలో నాణ్యమైన విద్యను అందిస్తానని, నియోజక వర్గ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తానని, ప్రతి మండల కేంద్రంలో 50 పడకల అన్ని వసతులు కలిగినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపరుస్తానని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, స్థానిక యువతకు స్థానిక కంపెనీల్లో స్థానికులకు ఉపాధి కల్పన కల్పిస్తా, నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తా, ప్రతి గ్రామానికి ప్రజా రవాణా సౌకర్యం కల్పిస్తానని అన్నారు. గ్రామ గ్రామానికి బిటి రోడ్లు ఏర్పాటు చేసి, మండల కేంద్రానికి అనుసందానం చేస్తానని అన్నారు. ప్రతి పేదించి అర్హులైన మహిళలకు సొంతింటి కళ సాకారం చేస్తామని, నిత్యం రద్దీగా ఉండే షాద్ నగర్ పట్టణానికి ఎంఎంపిఎస్ రైళ్లను షాద్ నగర్ కు తీసుకువస్తా, విద్యార్ధుల, ఉద్యోగుల ప్రయాణ సౌలభ్యానికి కృషి చేస్తా అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని అర్హులైన నియోజకవర్గ ప్రజలకు అందేలా చూస్తానని, షాద్ నగర్ పట్టణానికి కేంద్రీయ విద్యాలయం తీసుకోస్తానని, విషాద్ నగర్ పట్టణంలో రైల్వేగేట్ ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీర్చుటకు రైల్వే ఫ్లైఓవర్స్ వెంబడే నిర్మిస్తానని పేర్కొన్నారు. ప్రతి మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల ద్వారా చేయూతను అందిస్తానని, షాద్ నగర్, కొత్తూర్ మున్సిపాలిటికి కేంద్ర ప్రభుత్వ నిధులతో పట్టణీకరణకు కృషి చేస్తాననీ అంతే బాబయ్య ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా తన సొంత మేనిఫెస్టోను తెలిపారు. బిజెపి ప్రచారానికి నియోజకవర్గంలో అపూర్వ స్పందన లభించింది ప్రజలు బాబయ్యకు మంగళ హారతులు పట్టారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :