Wednesday, 29 July 2026 12:37:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మహిళా జర్నలిస్టు తులసి చందు కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి...

Date : 27 June 2023 02:06 AM Views : 458

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మహిళా జర్నలస్టు తులసి చందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని మఠంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వస్కుల రామయ్య అన్నారు. మఠం పల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షులు మాట్లాడుతూ ప్రజల పక్షంగా ఉండి తన జర్నలిజం వృత్తిని ఆధారం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న జర్నలిస్టు తులసి చెందును కొంతమంది మతోన్మాద శక్తులు ఇష్టానుసారంగా దుర్భాషలాడటం మహిళా సమాజాన్ని కించపరచడం, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయటం అవుతుందని అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె ఉన్న వాస్తవాలను సమాజం దృష్టికి తీసుకువచ్చినప్పుడు అందులో పొరపాట్లు ఉంటే అందుకు తగిన విధంగా స్పందించాలి కానీ మహిళా జర్నలిస్టును పట్టుకొని నానారకాల దుర్భాషలాడటం బండ బూతులు తిట్టడం పలు రకాలుగా ఇబ్బందులు పెట్టడం మానవత్వం అనిపించుకోదని మహిళలను గౌరవించాలని మంచి సంప్రదాయం భారతదేశంలో ఉండగా ఒక విలువైన జర్నలిజంలో ఉన్నటువంటి మహిళ సోదరిని తన సోదరిగా భావించి సహకరించేది పోయి ఆమెను మానసికంగా వేదనకు గురిచేయడం సిగ్గుచేటు అని జర్నలిస్టు తులసి చెందుకు మానవత్వం ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు అండగా నిలవాలని అదేవిధంగా జర్నలిజం సమాజం తులసి చందుకు అండగా ఉంటుందని తులసి చందు ధైర్యంగా ఉండి జర్నలిజంలో వస్తున్న అవరోధాలను ఎదిరించాలని అందరికీ ఆదర్శప్రాయంగా విరోధులకు చెంపపెట్టుగా తన జర్నలిజం వృత్తిని కొనసాగించాలని తెలిపారు. ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పోలీసులు ప్రజలు జర్నలిస్టు మిత్రులు ప్రతి ఒక్కరూ తులసి చందు కు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాండు నాయక్, రవీందర్ నాయక్, శివారెడ్డి, చిలక సైదులు, సుధాకర్,శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :