సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : పారిశ్రామిక ప్రాంతాలైన కొత్తగూడెం పాల్వంచలోని ఎక్కువ శాతం యువత ఉద్యోగావకాశాల కోసం వలస వెళ్తున్నారని ఇది శోచనీయమని బీఎస్పీ కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థి యెర్రా కామేష్ అన్నారు.మన కొత్తగూడెం మన కామేష్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన పట్టణంలోని వేంకటేశ్వర హిల్స్ కాలనీ,హమాలీ కాలనీ,నెహ్రూ నగర్,కాంట్రాక్టర్స్ కాలనీ, నెహ్రు నగర్, బాపూజీ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.పాల్వంచలో తెల్లవారుజామునే వెళ్లి విద్యుత్ కళాభారతి వద్ద వ్యాయామం, వాకింగ్ చేస్తున్న వారిని కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పాల్వంచ కేటీపీఎస్ ఉద్యోగులను కలిసి వారి మద్దతును కోరారు. స్వచ్ఛభారత్ కార్మికులను కలుసుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రగతి పేరుతో చిన్నచిన్న ప్రాంతాలే అభివృద్ధి బాట పడుతుంటే ఎన్నో ఏళ్ల క్రితం పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ పట్టణం రోజు రోజుకి కుంచించుకుపోతుందని అన్నారు. కొత్తగూడెంలో బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని పాల్వంచ రూరల్ ప్రాంతంలో కిన్నెరసాని ఉందని అన్నారు. వీటన్నిటిని కలుపుకుంటూ నూతన పారిశ్రామిక ప్రగతి కోసం చర్యలు తీసుకుంటే ఎన్నో కొత్త పరిశ్రమలు వచ్చేయమన్నారు ఆ దిశగా గతంలో ఎన్నిక కాబడ్డవారు ప్రస్తుతం ఎన్నికైన వారు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని వెళ్లాలంటే స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. పాల్వంచలో నూతన పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేలా తప్పకుండా చర్యలు తీసుకొని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. పాల్వంచ పట్టణంలో సర్వేనెంబర్ 817,727 లకు రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించి, యాజమాన్య హక్కు కల్పిస్తామని ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. నాలుగుసార్లు గెలిచానని చెప్పుకునే ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్వంచకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన జలగం సైతం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. విభజిత తెలంగాణ ఏర్పడక ముందు ఎమ్మెల్యేగా ఉన్న కూనంనేని సాంబశివరావు కూడా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయలేదని ఆ విషయం ప్రజలకు తెలుసునని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళందరూ మళ్ళీ పోటీ చేసేందుకు ఏ ముఖం పట్టుకొని వచ్చారో అర్థం కావడం లేదని అన్నారు.గడిచిన అనేక సంవత్సరాలుగా ప్రజల పక్షాన బీఎస్పి పార్టీ తరపున తాను అనుక్షణం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉండే వారికి అండగా ఉంటారని ఆ రకంగా బీఎస్పీని గెలిపించుకొని తీరుతారని స్పష్టం చేశారు.ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్, జిల్లా మహిళ అధ్యక్షురాలు బండి రమణి, అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, అసెంబ్లీ మహిళ అధ్యక్షురాలు కేతిని కుమారి, కోలా మల్లికా తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin