Thursday, 30 July 2026 12:26:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెదరాసు సుబ్రమణ్యం, పల్లె రఘునాథ్ రెడ్డి పై లేనిపోని ఆరోపణలు మానుకో లేకపోతే చర్యలు తప్పవు...

Date : 22 December 2022 12:28 AM Views : 610

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ టీడీపీ కి ద్రోహం చేసింది ఎవరో గుండెల మీద చేయవేసుకొని చెప్పగలవా..? వైసీపీ ఎమ్మెల్యే తో 2019 ఎన్నికల్లో లాలూచీ పడింది నిజం కాదా..? పల్లెపై విమర్శలు చేయడమంటే సూర్యునిపై ఉమ్మివేయడంతో సమానమే. నీ ఆరోపణలు ఇప్పటికైనా మానుకో... లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు... పేదరాసుసుబ్రహ్మణ్యం మీరు టిడిపిలో ఉంటూనే పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పార్టీ అధిష్టానం నియమించిన పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పై చేసిన నిరాదరణ ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాము... పల్లె రఘునాథ్ రెడ్డి పేరును ఉచ్చరించే అర్హత ,స్థాయి నీకు ఏమాత్రం లేదు. నీవు చేసిన ఆరోపణలు నీ గుండె మీద చేయి వేసుకొని ఒకసారి ఆలోచించుకో. పల్లె రఘునాథ్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి తో కలిశారని మాట్లాడారని నోటికొచ్చినట్లు ఏదంటే అది మాట్లాడడం కాదు, అలాంటివి ఉంటే బహిరంగంగా నిరూపించండి... పల్లె రఘునాథ్ రెడ్డి సజ్జలతో మాట్లాడాలని అనుకుంటే ఏ రాత్రి వేళలో అర్ధరాత్రి వేళలో మాట్లాడాల్సిన కర్మ ఆయనకు లేదు.అలాంటి అవసరము పల్లెకు లేదు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పల్లె రఘునాథ్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి చేరాలని అనేక రకాలుగా పలు మార్లు ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆయన ఆ పార్టీలో చేరలేదు. వైఎస్ కే బెదరలేదు. ఇప్పుడు వైసీపీ నాయకులు ఎంత..? పల్లె కు ఇక సజ్జల ఎంత..? సుబ్రమణ్యం నోటికి ఏదోస్తే అది పల్లె రఘునాథ్ రెడ్డి పై మాట్లాడి చులకన కావొద్దు.. కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీనే పల్లె రఘునాథ్ రెడ్డి కి సర్వశ్వం. నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ప్రత్యక్ష దైవం .టీడీపీ కార్యకర్తలు అంటే ఆయనకు ప్రాణం. ఈ పక్కన ఉన్న సూర్యుడు ఆ పక్క పుట్టినా పల్లె రఘునాథ్ రెడ్డి శ్వాస టిడిపినే. పల్లె శరీరం కోసినా ఆ రక్తం కూడా టీడీపీనే. ఎవడో సుధాకర్ రెడ్డికి డబ్బులు ఇచ్చాం అని చెప్తున్నారు... గతఎన్నికల్లో నేనే ఖర్చు పెట్టుకున్న అంటున్నావు... నీ రాజకీయ జీవితంలో జరిగిన అన్ని ఎలక్షన్లకు కలిపినా 10 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదు. చివరకు బుక్కపట్నం మండలంలో ఎంపీటీసీలకు సర్పంచ్లకు ఎన్నికల్లో కూడా పల్లె రఘునాథ్ రెడ్డి సొంతంగా డబ్బులు ఇచ్చి అన్ని ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకున్నారు.నీవు ఒకటి చూపించు పెదరాసు సుబ్రమణ్యం అని డిమాండ్ చేశారు. ఇది కూడా నువ్వు మర్చిపోయావా పెదరాసు... నీవు తిన్నంటివాసాలు లెక్కపెట్టే రకం... అని ఏదేవా చేశారు పల్లె రఘునాథ్ రెడ్డి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా కాంట్రాక్టు వర్కులు చేయలేదు. కనీసం ఆయన కాంట్రాక్టర్ కూడా కాదు. ఆయన జీవితంలో ఒకరికి సహాయం చేశారే తప్ప ఇతరుల నుంచి తీసుకునే అలవాటు లేదు. ఆ ఆలోచన ఏనాడూ లేదు. అటువంటి జీవితం ఆయనది. ఆయనపై నిందలు వేయడం సూర్యునిపై ఉమ్మివేసినట్లే... పల్లె రఘునాథ్ రెడ్డి నియోజకవర్గంలో నిత్యం లక్షలాది రూపాయలు కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసి ఆదుకునే గుణమే కానీ ప్రజల నుంచి ఏనాడు రూపాయి ఆశించిన దాఖలాలు ఆయన రాజకీయ చరిత్రలోనే ఇప్పటి వరకు లేదు. అలాంటివి ఎన్నటికి ఉండవు కూడా . నీ మాదిరిగా డబ్బులకు కక్కుర్తి పడే రకం ఆయనకు లేదు . బద్వేల్ రమణారెడ్డికి పల్లె కాంట్రాక్టర్లు ఇచ్చాడని చెబుతున్నావు ఇది సరైనది కాదు. ప్రభుత్వం ఆహ్వానంచిన టెండర్లలో కదిరి కి చెందిన కేసీఆర్ ,రమణ రెడ్డి దక్కిన కాంట్రాక్ట్ వర్క్ అది. టెండర్లలో ఎవరైన పాల్గొనవచ్చు.అలాంటివి పల్లె రఘునాథ్ రెడ్డి స్వతహాగా ఇచ్చే వర్క్ లు కాదు .ప్రభుత్వం ద్వారా టెండర్లు వేసి నీవు కూడా పొందవచ్చు. టెండర్ల వర్కులు పల్లె రఘునాథ్ రెడ్డి కి ఏమాత్రం సంబంధం లేద. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేకుండపోవడం మీ అజ్ఞానానికి నిదర్శనం. వైసిపి వాళ్లకు పల్లె సాయం చేశాడని ఆరోపణలు చేస్తున్నావు అందులో ఒకటైన ఆధారాలతో నిరూపించగలవా ఒకసారి గుండెల మీద చేయి వేసుకొని వాస్తవాలు మాట్లాడు... పల్లె రఘునాథ్ రెడ్డి ఏనాడు కాంట్రాక్ట్ వర్కులు చేయలేదు. జీవితంలో కూడా ఆయన చేయాల్సిన అవసరం లేదు. నియోజకవర్గంలో జరిగిన వర్కులు కార్యకర్తల ద్వారా జరిగినవే . నియోజకవర్గంలో ఏనాడైనా నీవు పార్టీ కోసం 100 రూపాయలు అయినా ఖర్చు చేసిన చరిత్ర నీకు ఉందా..? అని ప్రశ్నించారు. కనీసం స్వతహాగా అయినా నీ సొంత డబ్బులతో పదిమందికి పార్టీ సభ్యత్వం కట్టావా... అని ఎద్దేవా చేశారు. నీవు కూడా పార్టీని అడ్డం పెట్టుకుని ఇన్చార్జిని విమర్శించడం సిగ్గుగా లేదా అని గుర్తు చేశారు. నీ శక్తి నీకు తెలుసు . కానీ నీవు ఎంపీటీసీ పదవికి తక్కువ.జడ్పిటిసికి మరి ఎక్కువ. టీడీపీ ఎమ్మెల్యే పదవి ఆశించడంలో తప్పు లేదు. ముందు ప్రజల్లో ప్రజాదరణ,ఆర్థిక, అంగబలం పొంది పార్టీకి బాగా కష్ట పడితే పార్టీ అధిష్టానం గుర్తిస్తే మంచి ఉన్నత పదవులు పొందవచ్చు. పార్టీ కోసం వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని నీవు ఆశించే ఆ పదవులకు కూడా నీవు అనర్హుడువి... ఎద్దేవా చేశారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నీవు ఏమాత్రం కూడా పనిచేయలేదు ప్రజారాజ్యం పార్టీకి నీవు, నీ అనుచర వర్గం పనిచేసింది వాస్తవం కాదా..? 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నామమాత్రంగానే పనిచేశావు. ఒక్క ఓటు ఎవరైనా ఆడిగావా..? అని ప్రశ్నించారు. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గెలుపు కు ఏనాడైనా చిత్తశుద్దిగా పని చేశావా..? అని గుర్తు చేశారు 2019 ఎన్నికల్లో నేనే ఎమ్మెల్యే కాండేట్ అని చెప్పుకున్న నీవు మ్యమ్యలకు కక్కుర్తి పడి పల్లె తో మ్యమ్యలు తీసుకున్నది వాస్తవం కాదా..? అని గుర్తు చేశారు. ఇదే ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రెడ్డితో చేతులు కలిపి 13 లక్షల మ్యమ్య తీసుకున్నది నిజమా కాదా..? ఒకసారి గుండెల మీద చేయి వేసుకొని నిజాలు నిర్భయంగా చెప్పు..? టీడీపీని ద్రోహం చేసింది నిజమా కాదా..? ఈ మధ్యన జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ను ,ఇతర జనసేన పార్టీ నాయకులను నీవు కలిసి పార్టీలో చేరుతానని అడుక్కున్నది నిజం కాదా..? చివరకు నీ స్థితి గతులను తెలుసుకొని పార్టీ లోకి చేర్చుకోకుండా నిన్ను పక్కన బెట్టింది నిజం కాదా..? 2018 19 లో సినిమాలు తీసుకుంటూ గడిపినావు తప్ప టీడీపీపార్టీకి ఏనాడైనా పని చేశావా..? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో టిడిపి అధికారం కోల్పోయాక ఈ మూడేళ్లు కాలంలో అజ్ఞాతంలో గడిపావే కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ పార్టీ సభ్యత్వం కార్యక్రమాల్లో కానీ ఏనాడైనా పాల్గొన్నారా..? మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపిటిసి, జడ్పిటిసీ లను నీ స్వంత మండలం బుక్కపట్నం లో అభ్యర్థులను కూడా నిలబెట్టకుండా ఢిల్లీకి పారిపోయింది నీవు కాదా..? అని ప్రశ్నించారు. స్థాయికి మించిన పదవులు అడగడం ఇతరులను విమర్శించే ముందు నీ స్థాయి ఒకసారి ఆలోచించుకో. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కావాలంటే ప్రజాబలం ఆర్థిక బలం ఎంతో అవసరం అలాంటిది నీకు ఒకటైన ఉందా..?అని ప్రశ్నిస్తున్నా. నీవు వన్ మ్యాన్ ఆర్మీ మాత్రమే. శిశుపాలుడు మాదిరిగా తప్పు మీద తప్పు చేస్తున్నావు .ఇప్పటికే టీడీపీ పార్టీ సిద్ధాంతాలను ధిక్కరిస్తూ బహిరంగంగా నియోజకవర్గ ఇన్చార్జి పై మీడియా ద్వారా విమర్శలు చేశావు... ఇప్పటికే కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రెస్ మీట్ లు పెట్టి టీడీపీ ఇంచార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డిపై బుడిదచల్లే విధంగా విమర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ధిక్కరిస్తూ పార్టీని నష్టపరుస్తున్నారు. నీ కలశాలలకు అనుమతులు కూడా ఇప్పించింది పల్లె రఘునాథ్ రెడ్డి కాదా..? అలాంటి వ్యక్తి పై విమర్శలు చేయడం నీకు నోరు ఎలా వచ్చింది. కృతజ్ఞత లేని వారు ఏ పదవి పొందే అర్హత స్థాయి నీకు లేదు... అని దేవా చేశారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో మీపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా పార్టీ అధిష్టానంపై టీడీపీ కార్యకర్తలగా హెచ్చరిస్తున్నాము. బుక్కపట్నం మండల టీడీపీ పార్టీ కన్వీనర్ మల్లిరెడ్డి, హెచ్చరించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :