Wednesday, 29 July 2026 05:20:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నియోజకవర్గం అభివృద్ధిపై ముఖ్యమంత్రికి లేఖ రాసిన నాడెం శాంతి కుమార్*)

Date : 04 December 2025 03:02 PM Views : 152

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : విషయం : నర్సంపేట పట్టణం – నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజావినతులు సమర్పణ నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి పథకాల శంకుస్థాపన కొరకు నర్సంపేటకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి స్వాగతం సుస్వాగతం నర్సంపేట నియోజకవర్గ ప్రజల తరఫున మా పట్టణ – ప్రాంత అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, ప్రజా సౌకర్యాల బలోపేతం కోసం కొన్ని అత్యవసర సమస్యలు మరియు అభివృద్ధి సూచనలను మీ దృష్టికి వినమ్రంగా సమర్పిస్తున్నాము. పట్టణ అభివృద్ధి – అత్యవసర ప్రజా సమస్యలు & వినతులు నర్సంపేట పట్టణ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పట్టణంలో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగి పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారంగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయగలరు. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవసరం. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సమయంలో రైతుల అభ్యర్థన మేరకు మాదన్నపేట చెరువు నుండి వరంగల్ రోడ్డు వరకు మూడు కోట్లతో పంట కాలువల లైనింగ్ పనులు జరిగినాయి. ఆ పనులు తప్ప ఇప్పటివరకు పెద్ద కాలువ రైతులను పట్టించుకున్న నాధుడే లేడు. మాదన్నపేట పెద్దకాలువ సుందరీకరణ & లైనింగ్ కాలువ ఇరువైపులా లైనింగ్ పనులు చేపట్టి సుందరీకరించాలి. పట్టణ మురికినీరు చేరకుండా ప్రత్యేక డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేయాలి. చివరి ఆయకట్టు రైతులకు నీరు అందేలా కాలువను పునరుద్ధరించాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పూర్తి స్థాయి పూర్తి చేయడం అసంపూర్తిగా ఉన్న UGD పనులను శాశ్వతంగా పూర్తి చేసి పట్టణ ప్రజలకు రహదారి, కాలువ సమస్యలను తగ్గించాలి. మాదన్నపేట మినీ ట్యాంక్ బండ్ (గత ప్రభుత్వం మంజూరు – ₹6 కోట్లు) ఆమోదించబడిన నిధుల పనులు మధ్యలో ఆగిపోయాయి. వెంటనే పునఃప్రారంభించి పూర్తి చేయాలి. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న శివాలయ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలి. ముఖ్య రహదారులు & జంక్షన్ల అభివృద్ధి పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ప్రధాన కూడళ్లను పునర్‌వ్యవస్థీకరించాలి. వరంగల్ రోడ్డు నుండి మార్కెట్ యార్డ్ మీదుగా – మహబూబాబాద్ హైవే రహదారి వరకు రోడ్డు అభివృద్ధి ఈ ప్రధాన రహదారికి ఇరువైపులా శాశ్వత UGD నిర్మాణం అత్యవసరం. పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం నర్సంపేట పట్టణం కోసం శాశ్వత తాగునీటి పథకం అమలు చేయాలి. 5 ఎకరాలలో పెద్ద పట్టణ పార్క్ నిర్మాణం పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉపయోగించుకునే విధంగా వాకింగ్ ట్రాక్, ఆట స్థలాలు కలిగిన పెద్ద పార్క్ ఏర్పాటు చేయాలని వినతి. మాదన్నపేట చెరువు కట్టపై ప్రతి సంవత్సరం నిర్వహించి అయ్యప్ప స్వాముల పంబరట్టు – శాశ్వత సౌకర్యాల ఏర్పాటు ప్రతి సంవత్సరం 15,000 మందికి పైగా పాల్గొనేందున: మెట్లు శాశ్వత స్టేజ్ తాగునీరు, లైట్లు, టాయిలెట్ వంటి సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేయాలి. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం అభివృద్ధి మినీ స్టేడియంగా అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి. పాకాల ఆడిటోరియం (గత ప్రభుత్వం మంజూరు – ₹5 కోట్లు) చివరి దశలో నిధుల కొరతతో ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తేవాలి. జడ్పీఎస్‌ఎస్ బాలుర పాఠశాలలో శాశ్వత వాకింగ్ ట్రాక్ పట్టణ ప్రజల వినియోగం కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి. చెత్త సేకరణ వాహనాల పెంపు ప్రస్తుతం ఉన్న ట్రాక్టర్లు సరిపోవడం లేదు. కనీసం 10 అదనపు చెత్త సేకరణ వాహనాలు మంజూరు చేయాలి, మున్సిపాలిటీ సిబ్బందిని పెంచాలి. శాశ్వత డంపింగ్ యార్డ్ నిర్మాణం నర్సంపేట మున్సిపాలిటీకి శాశ్వతమైన, పర్యావరణ అనుకూల డంపింగ్ యార్డ్ ఏర్పాటు అత్యవసరం. పశువుల దవఖాన నుండి–పుట్టల పంపు వరకు మార్గానికి సీసీ రోడ్డు రైతులకు ప్రయోజనం కలిగే ఈ రహదారిని వెంటనే అభివృద్ధి చేయాలి. నెక్కొండ రోడ్ పెద్ద కాలువ – మాదన్నపేట రోడ్డు పెద్ద కాలువ వరకు కట్టపై రోడ్డు అనేక గ్రామాల ప్రజలకు రాకపోకలకు అత్యవసరం కావున వెంటనే నిర్మించాలి. నర్సంపేట ఆర్టీసీ డిపోలో పాత బస్సులతో ప్రయాణ సమయంలో బస్సులు రిపేర్ వచ్చి ఆగిపోవడంవలన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు కావున అదనంగా 20 కొత్త బస్సులు కేటాయించాలి సీనియర్ సిటిజన్ల వెల్ఫేర్ సెంటర్ (1 ఎకరం) వృద్ధులకు శాశ్వత భవనం నిర్మించి వారానికి ఒక్కసారి వైద్య పరీక్షలు ఆరోగ్య సేవలు అందించాలి. పేదల కోసం 5 ఎకరాలలో భారీ కళ్యాణమండపం ప్రైవేట్ ఫంక్షన్ హాళ్ల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద కళ్యాణమండపం నిర్మించాలని వినతి. 20. నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయవలెనని వినతి నర్సంపేట పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చదువుకున్న నిరుద్యోగ యువతీ–యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరి ప్రతిభను పటిష్టపరచేందుకు, ఉద్యోగ అవకాశాలకు దారులు తెరవడానికి ప్రభుత్వం స్థాయిలో ప్రత్యేక శిక్షణ అవసరం ఉంది. అందువల్ల నర్సంపేట పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ & ట్రైనింగ్ సెంటర్, ఉద్యోగ అవగాహన వర్క్‌షాప్‌లు, కంప్యూటర్, టెక్నికల్, ఇండస్ట్రీ-ఓరియెంటెడ్ ట్రైనింగులు ఎర్పాటు చేయవలసిందిగా వినమ్రంగా కోరుతున్నాము. ఈ సెంటర్ స్థాపనతో యువతలో నైపుణ్యాలు పెరిగి, స్థానికంగా మరియు రాష్ట్ర/జాతీయ స్థాయిలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది నర్సంపేట యువత భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యమంత్రి గా ఈ సమస్యలు నర్సంపేట ప్రజల దైనందిన జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తున్నాయి. మా పట్టణ–నియోజకవర్గ అభివృద్ధి కోసం పై ప్రజావినతులను మీ నాయకత్వంలో త్వరితగతిన అమలు చేస్తారని మా హృదయపూర్వక ఆశ. మీ చొరవతో నర్సంపేట పట్టణం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని సంపూర్ణ నమ్మకంతో… ( *నాడెం శాంతి కుమార్*) రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్, నర్సంపేట నియోజకవర్గం, వరంగల్ జిల్లా

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :