సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ( ఎఫ్ పి ఓ ) ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ యొక్క కార్యకలాపాలు గురువారం రోజున కర్ని గ్రామంలో డైరెక్టర్లు రైతులకు అవసరమైన 20:20:0:13 ఎరువులని తెప్పించి విక్రయాలు ప్రారంభించారు. ఎఫ్ పి ఓ ల కోసం ( ఎస్ఎఫ్ఎసి ) స్మాల్ ఫార్మర్స్ అగ్రిబిజినెస్ కంసోర్ నిధులు, సీఎస్ఎ సుస్థిర వ్యవసాయ కేంద్రం నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా రైతు సమన్యయ కమిటీ అధ్యక్షులు వసంత గౌడ్ మాట్లాడుతూ.. రైతులను బలోపేతం చేయుటకు వ్యవసాయానికి అవసరమయ్యే అన్ని రకాల ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తదితర అన్ని రకాల సేవలు ఇక్కడ లభిస్తాయని, మండల రైతులు మరియు పరిసర గ్రామాల రైతులు సద్వినియోగించుకోవాలని ప్రతి రైతు ఇందులో సభ్యత్వం పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అక్రమ్, ఎంపీటీసీ చిన్న రంగప్ప, ఉప సర్పంచ్ కృష్ణయ్య గౌడ్, సి ఈ ఓ రాజేందర్ రెడ్డి, మక్తల్ ఎఫ్ పి సి ఎల్ డైరెక్టర్లు పురుషోత్తం రావు, ఖలీల్, పోతురాజు లక్ష్మన్న , సత్యనారాయణ గౌడ్, కర్ని ఆంజనేయులు గౌడ్, వెంకటప్ప, కటికెళి రవి, విఆర్ఎ ఆంజనేయులు, పంచలింగాల హనుమంతు, రామేశ్వర్ రెడ్డి, కర్ని, రుద్రసముద్రం, పంచలింగాల, ఎర్సన్ పల్లి గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin