Wednesday, 29 July 2026 05:20:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సమగ్ర ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి ...

Date : 20 December 2024 10:46 AM Views : 455

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మిర్యాలగూడ మండలం అనంతపురంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ముందు పుస్తకాలు పట్టుకొని చదువుతూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఉద్యోగుల సమ్మెతో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు.ఎంఈవో ఆఫీసులలో డీఈఓ ఆఫీస్ లో విద్యా వ్యవస్థ సంబంధించిన పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమగ్ర ఉద్యోగుల సమస్యలన్నిటిని పరిష్కరించాలని తామ అధికారంలోకి వస్తే సమగ్ర ఉద్యోగస్తుల సమస్యలను చిట్కాలో పరిష్కారం చేస్తామని చెప్పిన నాడు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్ఛేసరికి ముఖ్యమంత్రి గారు మర్చిపోయినా రా అని ప్రశ్నించారు. సమగ్ర ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం మరియు ఉద్యోగ భద్రత రెగ్యులరేషన్ కోసమే పోరాటం చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ కేబినెట్ లో మంత్రి పదవి కావాలనో‌ సిఎం సీట్ కావాలనో సమ్మె చేయడం లేదన్న సంగతి మరచి తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల లో పేద మధ్యతరగతి విద్యార్థులు చదువులు ఆపివేసి ‌ డ్రాపవుట్ అయిన విద్యార్థీనీలు చదువుకోవాలని ఎంతో ఆశతో వచ్చిన పేద మధ్యతరగతి విద్యార్థీనీల చదువులపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు చల్లుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సమగ్ర ఉద్యోగుల సమ్మెతో గత పది రోజులుగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు జరగకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు మరియు పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంలో డిసెంబర్ నెలలో అన్ని సబ్జెక్టుల పూర్తి కావాల్సి ఉన్న సమగ్ర ఉద్యోగ సమ్మెతో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు చదువులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో 100% ఫలితాలు సాధించాలంటే సమగ్ర ఉద్యోగస్తులందరి సమస్యలు పరిష్కరించి. వారి సమ్మె విరమింప చేసి ప్రభుత్వం వారితో చర్చలు జరిపించి సమ్మె విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పంతాలకు పట్టింపులు పోయి ప్రభుత్వం సమ్మె పై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే విద్యార్థుల పక్షాన బలమైన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో DYFIరాష్ట్ర కమిటీ సభ్యులు పతాని శ్రీను,డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మూడవత్ జగన్ నాయక్,కుర్ర సైదా వేములపల్లి మండల కార్యదర్శి పుట్ట సంపత్, దామచర్ల మండల కార్యదర్శి ధీరావత్ వీరన్న తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :