సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరిలో ఈరోజు జరిగిన హ్యాండ్ బాల్ నియోజకవర్గ స్థాయి పోటీల్లో ఓబుల దేవర చెరువు మండలానికి చెందిన ఐదుగురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఓబుల దేవర చెరువు మండలం జీవనజ్యోతి పాఠశాలకు చెందిన ఇద్దరు బాలురు ముగ్గురు బాలికలు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. వారు ఇలా ఎంపిక కావడం పట్ల విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ రిన్సి, పీఈటి రియాజ్ భాష అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మా పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
-----------------------
Admin