సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం రోజున ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎయిడ్స్ ని నిర్మూలిద్దాం దేశాన్ని కాపాడుదాం అంటూ నినాదాలతో విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ చిన్నయ్య గారు మాట్లాడుతూ దేశంలో విస్తృతంగా పెరిగిపోతున్న ఎయిడ్స్ వ్యాధిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని దాని నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ గంగారం గారు మరియు కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు...
-----------------------
Admin