Thursday, 30 July 2026 06:43:57 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ రన్ ను జండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి.

Date : 13 June 2023 01:49 AM Views : 392

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా నారాయణ పేట జిల్లా, మక్తల్ పట్టణ కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు తెలంగాణ రన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు. ఇట్టి తెలంగాణ రన్ కార్యక్రమంలో జిల్లా జడ్పి చైర్మన్ వనజ ఆంజనేయులు గౌడ్, డిఎస్పి సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి మరియు యువకులు, చిన్నారులతో కలిసి పట్టణ పుర వీధులగుండా అంబేద్కర్ చౌరస్తా వరకు పరుగులు తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెంరాంమోహన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ వచ్చాక పోలీస్ శాఖలో తమకంటూ ఒక గౌరవం, హోదా లభించిందని అన్నారు. విధి నిర్వహణలో స్వేచ్ఛ ఉందని, అసాంఘిక శక్తులను అణిచివేయడంలో ప్రభుత్వ సహకారం గొప్పదని అన్నారు. ధశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ సురక్ష దినోత్సవం తో పాటు తెలంగాణ రన్ కార్యక్రమం కూడా చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పోలీస్ శాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుల ఆట కట్టిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న వివిధ మండలాల , గ్రామాల ప్రజాప్రతినిధులు, ఎస్ఐ లు పర్వతాలు , నరేందర్ , పీఈటీ లు, కో ఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ సిబ్బంది, మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువనాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :