సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఎల్బీనగర్ : వనస్థలిపురం డివిజన్ పరిధిలో వారిది నిరుపేద కుటుంబం. అలాంటి పరిస్థితుల్లో ఇంటి పెద్ద అయిన తల్లి అకస్మాత్తుగా మరణించింది. పేదరికంలో ఉన్న కుమారుడిది ఎటూ పాలుపోలేని స్థితి. మాతృమూర్తి అంత్యక్రియలు చేయలేని పరిస్థితి. ఆ విషయం ఇరుగుపొరుగు వారితో గద్దె విజయ్ నేత మిత్ర బృందానికి చేరింది. స్నేహ బృందం తరపున రూ.25 వేల తక్షణ ఆర్థిక సాయం చేసి ఆపన్నహస్తం అందించింది. బీఎన్ రెడ్డి డివిజన్ లోని ఎస్.కె.డి నగర్ కాలనీకి చెందిన సంతోష్ గుప్తా తల్లి స్వర్గస్తులయ్యారు. పేదరికంతో ఇబ్బందుల్లో ఉండగా అంత్యక్రియలు నిర్వహించడానికి విజయ్ నేత మిత్రబృందం మంగళవారం రూ.25,000 సంతోష్ గుప్తకి అందించి దాతృత్వం చాటారు. సాయం చేసిన వారిలో విజయ్ నేత, బాలరాజ్, కిషోర్ గౌడ్, జై సింహ గౌడ్, జై గురు గౌడ్, తిరుపతిరెడ్డి, బబులు, ఇతర మిత్రులు ఉన్నారు.
-----------------------
Admin