సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగటంతో వీలైనంత వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగడం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలను వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రకటన చేస్తూ రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదాచారులను గుర్తించడం, వీక్షించే సామర్ధ్యం తక్కువుగా వుంటుంది. ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నందున, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఈ సమయాల్లో ప్రయాణాలను మానుకోగలరని వరంగల్ సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పొగమంచు ఎక్కువగా ఉండే సమయంలో వాహనాలు నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీపీ సూచిస్తూ వాహనాలను వేగంగా నడపొద్దని, వాహనదారులు శ్రద్ధతో, నిదానంగా ప్రయాణించాలి. తక్కువ వీక్షించే సామర్ధ్యం కారణంగా ఇతర వాహనాలు, పాదచారులు, మలుపులు, రోడ్డు విభాగాలు సరిగా కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, హెడ్‌లైట్లను లో బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లను వాడాలని సూచించారు.అత్యవసర సమయాల్లో ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాల స్థితిని ముందుగానే తనిఖీ చేసుకోవంతో పాటు ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ఆకస్మికంగా ఓవర్‌టేక్ చేయడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం వంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడవద్దని పోలీసుల సూచనలతో పాటు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనదారులు వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవడమే వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రధాన లక్ష్యమని సీపీ వెల్లడించారు.పొగమంచు కారణంగా రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయకండి -వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్,వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగటంతో వీలైనంత వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగడం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలను వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రకటన చేస్తూ రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదాచారులను గుర్తించడం, వీక్షించే సామర్ధ్యం తక్కువుగా వుంటుంది. ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నందున, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఈ సమయాల్లో ప్రయాణాలను మానుకోగలరని వరంగల్ సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పొగమంచు ఎక్కువగా ఉండే సమయంలో వాహనాలు నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీపీ సూచిస్తూ వాహనాలను వేగంగా నడపొద్దని, వాహనదారులు శ్రద్ధతో, నిదానంగా ప్రయాణించాలి. తక్కువ వీక్షించే సామర్ధ్యం కారణంగా ఇతర వాహనాలు, పాదచారులు, మలుపులు, రోడ్డు విభాగాలు సరిగా కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, హెడ్‌లైట్లను లో బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లను వాడాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాల స్థితిని ముందుగానే తనిఖీ చేసుకోవంతో పాటు ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ఆకస్మికంగా ఓవర్‌టేక్ చేయడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం వంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడవద్దని పోలీసుల సూచనలతో పాటు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనదారులు వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవడమే వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రధాన లక్ష్యమని సీపీ వెల్లడించారు.
-----------------------
Reporter