సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన చేసినా బ్యాంకర్లు మాత్రం తమను డబ్బులు చెల్లించాలని ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు... షాద్ నగర్ పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ముందు షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ధర్నా నిర్వహించారు. బరోడా బ్యాంక్ లో రైతులకు సంబంధించి దాదాపు 2000 మంది బ్యాంకు ఖాతాలు ఉండగా కేవలం 600 మందికే రైతు రుణమాఫీ అందిందని వారు వాపోయారు. ఇదే సమయంలో బ్యాంక్ నుండి ఫోన్లు చేసి డబ్బులు చెల్లించాలని ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
-----------------------
Admin