Tuesday, 15 September 2026 12:32:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కమ్మదనం మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం వద్ద ఘనంగా తెలంగాణ మంచినీళ్ల పండుగ.

Date : 19 June 2023 01:27 AM Views : 514

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, ఫారూఖ్ నగర్ మండల్ / తెలంగాణ ప్రభుత్వ హయాంలో షాద్ నగర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు, అన్ని వర్గాలకు మంచినీరు అందించేందుకు కోట్లాది రూపాయల ఖర్చు చేసి నీళ్లు అందించామని, పాలనలో చరిత్ర సృష్టించామని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్ నగర్ మండలం కమ్మదనం గ్రామ పరిధిలో ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం వద్ద తెలంగాణ మంచినీళ్ల పండగ కార్యక్రమాన్ని అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఆయా గ్రామాల స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా.. రూ. 433.70 కోట్ల నిధులతో మిషన్ భగీరథ పథకానికి వ్యయం చేశామని ఆన్నారు. షాద్ నగర్ నియోజక వర్గంలో 79, 527 ఇండ్లకు నల్ల కనెక్షన్లు, 321 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణంతో కమ్మదనం మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. మిషన్ భగీరథ పథకం గురించి ఎమ్మెల్యే అంజయ్య సవివరంగా వివరిస్తూ.. నియోజవర్గంలోని 6 మండలాల్లో 68,027 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని 298 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించడం జరిగిందని దీనికి వ్యయం 110.64 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీలో 11,500 నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని 7 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించడం జరిగిందని అన్నారు. కమ్మదనం నీటి శుద్ధి కేంద్రం 260 కోట్లతో నిర్మించడం జరిగిందనీ, 16 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించడం జరిగిందని తెలిపారు. మంచినీటి కోసం నియోజకవర్గ మొత్తంలో 433.70 కోట్ల రూపాయల నిధులు చరిత్రలో నిలిచిపోయే విధంగా పనులు చేపట్టామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :