Wednesday, 16 September 2026 12:58:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అన్నపురెడ్డిపల్లి ప్రజలు తస్మాత్ జాగ్రత్త...

Date : 14 January 2024 03:57 AM Views : 467

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : సంక్రాంతికి సొంతూరికి వెళ్లేముందు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తు న్నారా..? ఎప్పటిలాగే డోర్ మ్యాట్ కింద, చెప్పుల స్టాండ్స్లో తాళాలు వదిలి వెళ్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త అంటున్నారు ఎస్సై SD షాహినా, సంక్రాంతికి నగరాలను వదిలి ఇంటిల్లిపాది సొంతూళ్లకు వెళ్లి మూడ్రోజుల పాటు పండుగ చేసుకుంటే.. మీకు తెలియకుండా ఇచ్చే సమాచా రంతో దొంగలు కూడా మీ ఇంట్లో దొంగతనం చేస్తారని, సంక్రాంతి కి సొంతూళ్లకు వెళ్లేవారు తప్ప నిసరిగా పాటించాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు.... పండగకు మీరు సంతోషంగా ఇండ్లకు వెళ్లండి.. అవసరమైతే మీ ఇంటికి మేము గస్తీ కాస్తాం' అంటూ భరోసా ఇస్తున్నారు. ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి. లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ను ఏర్పాటు చేసుకోండి. మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం అమర్చుకోవడం మరీ మంచిది. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీసే స్టేషన్లో సమాచారంఇవ్వండి. మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్కు సమాచారం ఇవ్వండి. తప్పనిసరిగా లాక్ చేసిన తాళం కనపడకుండా కర్టెన్స్తో కవర్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేప్పుడు ఇంటి లోపల, బయట లైట్లు వేస్తే మంచిదని అంటు న్నారు. ఇంటి దగ్గర నమ్మకమైన ఇరుగుపొరు గువాళ్లకు ఇంటిని గమనించాలని చెప్పండి. ఇంటికి వచ్చే, వెళ్లే దారుల్లో, ఇంటిలోపల సీసీ కెమెరాలు అమర్చుకొని డీవీఆర్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో పెట్టుకోవాలి. మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోండి. ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా చైన్స్తో లాక్ వెయ్యడం మంచిది. నమ్మకమైన వ్యక్తులకు మాత్రమే ఇంటి నుంచి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి. మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు చూసుకొంటూ ఉండాలి. ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్స్, పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడండి. వాటిని కూడా గమనించి నేరస్థులు దొంగతనా లకు పాల్పడే అవకాశం ఉన్నది. బీరువా తాళాలు పరుపులు, దిండ్ల కింద, అల్మరాపైన, డ్రెస్సింగ్ టేబు ల్లో, కప్బోర్డ్స్ ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచటం ఉత్తమమని చెప్తు న్నారు. బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్ష న్లకు, గుడికి వెళ్లేప్పుడు తగు జాగ్రతలు తీసుకో వాలని, బయటికి వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచిస్తున్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: