సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి పాలకీడు మండలాలలో కాంగ్రెస్,సీపీఎం పార్టీలకి బిగ్ షాక్ హుజుర్ నగర్ పట్టణంలోని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజుర్ నగర్ నియోజకవర పరిధిలోని మఠంపల్లి మండలం, పాలకీడు మండలం తదితర తండా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ సిపిఐ పార్టీ తదితర పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు కృష్ణా తండా నుంచి 20 కుటుంబాలు..ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరారు.ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించడం జరిగింది. భూక్య కోటేష్, ధరావత్ సుక్కో, బానోతు నాగరాజు, భూక్య శంబయ్య , భూక్య చానా, బానోతు లచ్చ, భూక్య రమేష్, అజ్మీర కృష్ణ భూక్య ధర్మ, బానోతు నాగరాజు బానోతు నాగరాజు పెద్ద, బానోతు నాగరాజు, భూక్య శ్రీను ,సైదా, భూక్య చిన్న, అజ్మీర గోపి, అజమెరా చంద్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించడం జరిగింది. పార్టీలో చేరిన వారిలో రవి నాయక్ జిల్లా కార్యవర్గ దర్శి సభ్యులు, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ధరావత్ సైదా నాయక్ మాజీ సర్పంచ్, మాలోత్ నాగా, బాణోత్ గణేష్, మాలోత్ హుస్యా, ధీరావత్ తుల్చ, ధీరావత్. పద్మ, సోమ్లి, ఝమ్లి,తదితరులు ఉన్నారు. మఠంపల్లి మండలం రఘునాథ పాలెంగ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ కి చెందిన వేముల యాగప్ప కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి,ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో BRS లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలని గిరిజనులు ఎన్నో ఏండ్లు పోరాడినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు రాష్ట్రంలో 4 వేల తండాలను, నియోజకవర్గ పరిధిలో 49 తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా చేసినామని తెలిపారు.నూతన గ్రామ పంచాయతీ భవనాలు ఏర్పాటు చేశాము. దీంతో గిరిజనులు స్వయంపాలన సాగిస్తున్నారని చెప్పారు. గిరిజనులకు పొడు భూములు ఇవ్వడం జరుగుతుంది. పోడు పట్టాలు పంపిణీ చేయడంతోపాటు త్రీఫేజ్ కరెంటు ఇస్తున్నామని తెలిపారు.గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది. హైదరాబాద్ నడి బొడ్డున బంజారా హిల్స్ లో బంజారా భవన్,మన హుజూర్ నగర్ పట్టణంలో గిరిజన భవన్ నిర్మాణం చేసుకోవడం జరిగింది మఠంపల్లి రైల్వే స్టేషన్ కి సంత్ సేవాలాల్ పేరు పెట్టుకోవడం జరిగింది. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని ప్రతి సంవత్సరం అధికారంగా నిర్వహించడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ నాయకత్వం లో మన తెలంగాణ ను లౌకిక రాష్ట్రంగా నిలుపుతున్నామని, కులం, మతం తేడా లేకుండా అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు పోతున్నామని తెలిపారు.
-----------------------
Admin