Wednesday, 29 July 2026 04:13:34 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు...

Date : 22 November 2023 11:57 AM Views : 1502

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఎఐఎఫ్ బి పార్టీ సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామస్తుల ఆహ్వానం మేరకు పర్యటన చేసినారు. ప్రజలంతా మద్దతు తెలిపి సింహం గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఇటువంటి నాయకుడిని ప్రజా సేవకున్ని నియోజవర్గంలో ఇంతవరకు చూడలేదని అన్నారు. మహిళలు కూడా తమ మద్దతు సింహం గుర్తుకేనని అన్నారు. ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతు నియోజకవర్గంలో గడిచిన కాలంలో అనేక సేవలతో ప్రజలు మన్నలను పొందానని, తనలాంటి మంచి ప్రజా సేవకున్ని కోల్పోతే నియోజకవర్గం జన్మలో కూడా బాగుపడదని అన్నారు. తాను ప్రజా సేవలు చేస్తుంటే కాంగ్రెస్,టిఆర్ఎస్ పార్టీల నాయకులు అధికార వ్యామోహంతో, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ధనార్జన ధ్యేయంగా పనిచేస్తూ అవినీతి అహంకార పాలనకు పాల్పడుతున్నారని అన్నారు. మన ఓట్లతో గెలిచి మన గ్రామానికి ఎప్పుడు రానివాళ్ళు ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చేసరికి పార్టీ టికెట్లు తెచ్చుకొని మరి ఓట్లు అడగవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గ్రామ ప్రజలారా వారికి చెప్పండి మా కుటుంబాల్లో కూడా ఒకరు రాజకీయ రంగ ప్రవేశం చేసాడని సింహం గుర్తుపై ఓటేస్తామని చెప్పండి అని అన్నారు. ప్రజా ఓట్లను దుర్వినియోగం చేసి పార్టీలు మారే నాయకులను నమ్మవద్దని, మన ఓట్లతో వారు గెలిచి పార్టీలు మారితే ప్రజలు మారినట్లా? అమ్ముడుపోయే దొంగ నాయకులు నమ్మవద్దు అని అన్నారు. పార్టీ టికెట్లు రానీకుండా చేసిన స్వార్థపూరిత నాయకులకు తావు ఇవ్వకుండా ప్రజలు ఆదరాభిమానంతో సింహం గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు తనపై అసత్యప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అందుకే తాను ప్రతి పల్లెలలో, పట్టణల్లో గడపగడప తిరుగుతూ సింహం గుర్తు పై ఓటెయ్యాలని ప్రచారం చేస్తూ, ప్రజా సమస్యలు ఊరు సమస్యలు వింటూ అధికారంలోకి రాగానే తీరుస్తా అన్నారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలకు దీటుగా మేనిఫెస్టో ఉంచానని సింహం గుర్తుపై ఎమ్మెల్యే గెలిచి అధికారంలోకి ప్రతి ఊరి సమస్యను, ప్రజల సమస్యలను తీరుస్తానన్నారు. తీర్చకపోతే రెండు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్యారంటీలను, టిఆర్ఎస్ మోసపూరిత పథకాలను నమ్మవద్దు అని అన్నారు . ఏదేమైనా ప్రజలందరూ మార్పును కోరుకొని మంచి వైపు నిలబడి సింహం గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించలన్నారు. తన ఎమ్మెల్యే గెలుపు ప్రజల గెలుపుగా నియోజకవర్గంలో చరిత్ర సృష్టిస్తుందని పిల్లుట్ల రఘు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,ఎఐఎఫ్బి పార్టీ సింహం గుర్తు కార్యకర్తలు, రఘున్న అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: