Saturday, 18 April 2026 08:09:33 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

2023-24 రాష్ట్ర బడ్జెట్ లో కొత్తగా ఏమి కేటాయింపులు లేవు... -పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు

Date : 07 February 2023 02:17 AM Views : 594

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరిష్ రావు అంకెల గారడీ, మాయ మాటలతో మేడి పండు మాధిరిగా రంగుల ప్రపంచంలాగా మెఘా బడ్జెట్ గా చూపించారు. రాష్ర్ట ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. ప్రజలను మభ్య పెట్టడం.. మోసం చేయడానికి అంకెలు పెంచి బడ్జెట్ పెడుతున్నారని గతంలో అనేక మార్లు చెప్పిందే ఇప్పడు నిజమైంది . బడ్జెట్ ను సంపూర్ణంగా అమలు చేయాలన్న చిత్త శుద్ది ఈ ప్రభుత్వానికి ఉంటే వాస్తవిక బడ్జెట్ ను పెట్టే వారు. రాష్ట్ర బడ్జెట్ లో డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటి స్థలాల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. వ్యవసాయానికి 24గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం 5గంటలు కూడ నాణ్యతగా ఇవ్వడంలేదని రైతులు ఆందోలన చెందుతున్నారు. రాష్ట్రంలో 50శాతం జనాభా కలిగిన బిసిలకు బడ్జెట్లో కేవలం 6229 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనిని బట్టీ బిసిలు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపో తెలుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గత 8 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నది. ఈ సారి కూడ అదే విధంగా చేసినది. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని చెప్పిన పాలకులు ఈ బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం విచారకరం. రాష్ట్ర ప్రభుత్వం ఏక కాలంలో రుణ మాఫీ అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16లక్షల మంది రైతులు బ్యాంకులల్లో ఢిఫాలర్టుర్లుగా మారారు. *నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్ లో మాటే ఎత్తలేదు. బిసి యాక్షన్ ప్లాన్ ను విస్మరించారు* 2014 నుంచి 2022-23 వరకు మాత్రం లిక్కర్ ఆదాయం మాత్రం పెంచుకుంటున్నారు. నీళ్లు, నిధులు, నియమకాలు, ఆత్మగౌరవం కొరకు తెచ్చుకున్న తెలంగాణలో వీటికి తగ్గట్టగా బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరుగలేదు. రెసిడెన్షియల్ పాఠశాలలు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా తరగతి గదులు, విశ్రాంతి గదులను ఏర్పాటు చేయలేదు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :