సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన భూమా నందినికి అరుదైన అవార్డు దక్కింది ఇటీవల యంగ్ ఛాంపియన్ అవార్డు వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ సర్టిఫికేట్ ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ అవార్డ్స్ (NIFAA) నుండి అందుకున్నారు ఈ అవార్డులు సెప్టెంబర్ 22 వ తేదీన న్యూ ఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగిన కార్యక్రమంలో నందినికి ప్రముఖులు ప్రదానం చేశారు చిన్న వయస్సులోనే సాధించిన ఈ విజయాలు ఆమె పట్టుదల కష్టపడి పనిచేసే నైపుణ్యం అసాధారణ ప్రతిభకు నిదర్శనం అని తన సహచరులు అభినందించారు దేశస్థాయిలో ఇంతటి మహోన్నతమైన అవార్డును అందుకున్న నందినినీ నేడు బిజెపి కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ శాలువాతో సన్మానించి అభినందించారు రానున్న రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు తను ఎదిగేలా నా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన భరోసా కల్పించారు.
-----------------------
Reporter