Friday, 08 May 2026 09:22:06 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లిని హత్య...

Date : 06 February 2025 11:26 AM Views : 915

సర్కార్ టీవీ న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : బిజినపల్లి మండలంలో చోటు చేసుకుంది. మహాదేవునిపేట గ్రామానికి చెందిన లేట్ల ఉత్తయ్య కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉత్తయ్యకు నాగమ్మ, యాదమ్మ ఇరువురు భార్యలు ఉన్నారు. అదే గ్రామంలో ఇద్దరు భార్యలు వేర్వేరు గుడిసెల్లో నివాసముంటున్నారు. ఇరువురు కూడా కూలీపని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇద్దరు భార్యల్లో ఒకరైన యాదమ్మకు కరుణాకర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే కరుణాకర్ మద్యం, గంజాయి కి బానిసగా మారి ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో మూడు రోజుల క్రితం తల్లి యాదమ్మతో గొడవ పెట్టుకున్నాడు. అయితే అప్పటికే గంజాయి మత్తులో ఉన్న కరుణాకర్… ఆవేశంతో తల్లిని గోడకేసి బలంగా కొట్టాడు.. దీంతో తల్లి యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం బయటకు పొక్కకుండా తల్లి మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న ముళ్లపొదలోకి ఈడ్చుకెళ్లి అక్కడ పడేసాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు... తల్లిని చంపి మూడు రోజులు గడిచింది. గత రాత్రి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కుక్కలు, పందులు కొంతభాగం పీక్కుతిన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం భర్త ఉత్తయ్యకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మత్తు దిగిన అనంతరం ఎప్పటిలాగే కుమారుడు కరుణాకర్ ఇంటికి చేరుకున్నాడు. అనుమానంతో కుమారుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. కన్నతల్లిని తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడు కరుణాకర్ ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :